ఎంబీసీ అట్రాసిటీ యాక్ట్‌ ఏర్పాటు చేయాలి : ఆశయ్య

13:46 - December 4, 2016

కామారెడ్డి : సీపీఎం చేపట్టిన మహాజన పాదయాత్రకు తెలంగాణ రాష్ర్టంలో విశేష స్పందన లభిస్తోంది. అన్ని రాజకీయ పార్టీల నేతలు కూడా పాదయాత్రకు మద్దతు తెలుపుతూ... పాదయాత్ర బృందంలో పాల్గొంటున్నారు. ప్రస్తుతం కామారెడ్డి జిల్లాలో కొనసాగుతున్న పాదయాత్ర ఇవాళ్టికి 49వ రోజుకు చేరుకుంది. సదాశివనగర్‌, మల్లుపేట, గాంధారి ఎక్స్‌రోడ్డు, మోడీగాం, భూంపల్లి, గుడిమెట్టు, జువ్వాడి, గాంధారిలో పాదయాత్ర జరుగుతోంది. పాదయాత్రకు విశేష స్పందన వస్తుంది. తెలంగాణ రాష్ర్టంలో ఎంబీసీలకు న్యాయం జరగడం లేదని పాదయాత్ర బృంద సభ్యులు ఆశయ్య తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈమేరకు ఆయన టెన్ టివితో ప్రత్యేకంగా మాట్లాడారు. చిన్న కులాలపై పెత్తందార్ల ఆగడాలు పెరిగిపోయాయని అన్నారు. చిన్న కులాలవారు సాంఘిక బహిష్కరణకు గురవుతున్నారని వాపోయారు. దళితుల తర్వాత ఎంబీసీలే ఎక్కువగా కులవివక్షకు గురవుతున్నారని పేర్కొన్నారు. ఎంబీసీలకు వెంటనే అట్రాసిటీ యాక్ట్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఎంబీసీల అభివృద్ధి కోసం ఎంబీసీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. ప్రజల నుంచి పాదయాత్ర బృందానికి అనేక వినతులు వస్తున్నాయని తెలిపారు.

 

Don't Miss