మహిళలకు సీరియల్స్ పిచ్చి అన్న గోవా మంత్రి..

13:45 - December 2, 2016

ఆయనో మంత్రి..బాధ్యాతయుతమైన పదవిలో ఉంటూ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ముఖ్యంగా మహిళలను కించపరుస్తూ పలు వ్యాఖ్యలు చేస్తుండడంతో వివాదాలు చెలరేగుతున్నాయి. తాజాగా గోవా సాంస్కృతిక శాఖ మంత్రి దయానంద్ మంద్రేకర్ వివాదంలో చిక్కుకున్నారు. మహిళలపై టీవీల్లో వచ్చే సీరియల్స్ ప్రభావం చూపెడుతున్నాయని, కష్టపడి వచ్చిన భర్తకు కనీసం కప్పు కాఫీ కూడా ఇవ్వడం లేదంటూ వ్యాఖ్యానించారు. ఓ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న సదరు మంత్రి ఈ వ్యాఖ్యలు చేసినట్లు వార్తలు వెలువడుతున్నాయి. టీవీల్లో ఎన్నో ప్రోగ్రామ్ లు వచ్చినా సీరియల్స్ పైనే మహిళలు ఆసక్తి చూపిస్తున్నారని, గ్రామాల్లో నిర్వహించే ఎన్నో కార్యక్రమాలు..సంప్రదాయ పండుగల‌కు మహిళలు హాజ‌రు కావడం లేదని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గోవా మంత్రి మంద్రేకర్ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు చెలరేగుతున్నాయి. మహిళలను కించపరిచేలా ఉన్నాయని కాంగ్రెస్ విమర్శిస్తోంది. మహిళలను అవమానపర్చడం బీజేపీ నేతలను కొత్తేమీ కాదని విమర్శిస్తున్నారు. మంత్రి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎలా స్పందిస్తుందో చూడాలి. 

Don't Miss