గీతగోవిందం మూవీ రివ్యూ

20:25 - August 15, 2018

సోలో, శ్రీరస్తు శుభమస్తు సినిమాలతో యూత్ ఫుల్ కమ్ ఎమోషనల్ కంటెన్ట్ ను అరెస్టింగ్ గా చెప్పగల డైరక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు పరశురాం. అలాంటి డైరక్టర్ తో యంగ్ సెన్సేషన్ విజయ దేవరకొండ టీం అప్ అయ్యాడు అనగానే ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఎర్పడ్డాయి.. ఇక దానికి గీతా ఆర్ట్స్ ప్రొడక్షన్ ట్యాగ్ ఆడ్ అవ్వగానే, కన్ఫాం హిట్ అని ఫ్రీ రిలీజ్ టాక్ విపరీతంగా స్ర్పెడ్ అయ్యింది.. ఈ సినిమా నుండి వచ్చిన లిరికల్ వీడియోస్, సినిమా ప్రోమోస్.. గీతగోవిందానికి కావలసినంత హైప్ ను తెచ్చిపెట్టాయి.. మరి అలా భారీ అంచనాల నడుమ  థియేటర్స్ లోకి వచ్చిన గీతగోవిందం తమ  లవ్ స్టోరీతో ఎలా ఆకట్టుకున్నారు.. ఆడియన్స్ ను ఎలా అలరించారో ఇప్పుడు చూద్దాం..
కథ విషయానికి వస్తే.. 
కథ విషయానికి వస్తే.. విజయ్ గోవింద్ చిన్నప్పటి నుండి అమ్మాయిలంటే రెన్పెక్ట్ తో, కుటుంబం అంటే ప్రేమతో పెరిగిన ఓ మంచి కుర్రాడు.. అతను గీతను చూసి, తొలిచూపులోనే ప్రేమలో పడతాడు..కాని ఓ ఇన్సిడెంట్ లో ఆమె దృష్టిలో రాంగ్ గా ప్రొజక్ట్ అవుతాడు. నాటకీయంగా అతని చెల్లిని గీతవాళ్ల అన్నయ్యకు ఇచ్చి నిశ్చితార్థం చేస్తారు.. విజయ్  వల్ల తన చెల్లెలి పెళ్ళికి ఏమైనా ఆటంకాలు ఏర్పడ్డాయా..? గీత దృష్టిలో రాంగ్ యాంగిల్ లో ఉన్న విజయ్, తన ఇన్నోసెన్స్ ఎలా ఫ్రూ చేసుకున్నాడు.. చివరికి గీతగోవింద్ కలిసి గీతగోవిందంగా ఎలా మారారు.. అనేది సినిమా చూసి తెలుసుకోవలసిందే..
నటీనటుల విషయానికి వస్తే.. 
నటీనటుల విషయానికి వస్తే.. ఈ సినిమాకు బిగెస్ట్ ఎసెట్ విజయ్ దేవరకొండ.ఒక క్యారక్టర్ కి కమిట్ అయితే అతను చూపించే డెడికేషన్, దాన్ని ఓన్ చేసుకునే తీరు, జనాలకి కనెక్ట్ చేసే విధానంలో.మరోసారి తన బెస్ట్ ఈ సినిమాకోసం ఇచ్చాడు.. సినిమా పూర్తి అయ్యే సరికి గీత మాత్రమే కాదు, థియేటర్ లో ఉన్న ప్రతీ ఒక్కరు విజయ్ గోవింద్ క్యారక్ట్ కు ఎడిక్ట్ అయిపోతారు.. అలాంటి లవర్ తమకూ ఉండాలని ఓ సగటు అమ్మాయి కోరుకుంటే తప్పు లేదు అనిపిస్తుంది.. పరశురాం పేపర్ మీద రాసుకున్న గోవింద్ పాత్రను పదింతలు పెంచి స్ర్కీన్ పై ప్రజంట్ చేశాడు విజయ్ దేవరకొండ. తన విలక్షణ మైన కామెడీ టైమింగ్, తెలంగాణ యాసతో మిక్స్ అయిన డైలాగ్ డెలివరీ, సూపర్బ్ బాడీ లాంగ్వేజ్ తో ఆధ్యాంతం గీతగోవిందాన్ని తన బుజాలపై మోశాడు.. విజయ్ కెరీర్ లో ఇదొక బెస్ట్ పర్ఫామెన్స్.. ఇక ఛలో సినిమాతో యూత్ ప్రేక్షకులను ఆకట్టుకున్న కన్నడ బ్యూటీ రష్మిక మందన్న ఈ సినిమాతో మరింత పేరు తెచ్చుకోవడం ఖయం.. విజయ్ కి థీటుగా నటించింది. గీత క్యారక్టర్ లో పూర్తిగా ఇన్వాల్వ్ అవ్వడం వల్ల.. ఎక్కడా కూడా కన్ఫ్యూజ్డ్ ఎక్స్ ప్రషన్స్ కాని బ్లాంక్ ఎక్స్ ప్రషన్స్ కాని కనిపించలేదు.. ఎమోషనల్ సీన్స్ లోసైతం ఆకట్టుకుంది. లీడ్ పెయిర్ సినిమా మొత్తాన్ని ఆథ్యాంతం కనువిందుగా నడిపించేయడంతో మిగతా వాళ్లందరికి స్ట్రేయిన్ తో పాటు, స్క్రీన్ స్పెస్ కూడా తగ్గింది. ఇక చివరిలో వచ్చిన వెన్నెల కిషోర్, మరోసారి తనదైన శైలిలో మెరుపులు మెరిపించాడు.. రాహుల్ రామకృష అండ్ గ్యాంగ్ విజయ్ ఫ్రెండ్స్ గా ఫుల్ డోస్ ఎంటర్టైన్మెంట్ పంచారు.. నిత్యామీనన్, అనూఇమ్మాన్యుయల్ అస్సలు ఊహించని సర్ఫ్రైజస్. నాగబాబు, మౌర్యాని,గిరిబాబు, అన్నపూర్ణమ్మ, రవిప్రకాశ్, అభయ్ తదితరులంతా తమ వరకు డీసెంట్ పర్ఫామెన్స్ ఇచ్చారు..
టెక్నీషియన్స్ విషయానికి వస్తే.. 
టెక్నీషియన్స్ విషయానికి వస్తే.. పాత కథలను తన రైటింగ్ ఎబిలిటీతో కొత్తగా చూపించి, హిట్స్ అందుకున్న పరశురాం.. మరోసారి గీతగోవిందం ని కూడా తన కంఫర్ట్ జోన్ ను ఎంచుకున్నాడు. కాకపోతే గోవింద్ అండ్ గీత పాత్రలను స్ట్రాంగ్ గా రాసుకోవడం వల్ల, వాటి లోని అన్ని వేరియేషన్స్ ను చూపించడం వల్ల, లీడ్ పెయిర్ మీదనే పూర్తిగా డిపెండ్ అయిపోయి, సగం పైగా సినిమాను నడిపంచేశాడు. ఫస్ట్ ఆఫ్ అంతా ఎక్కడా వంక పెట్టడానికి లేకుండా, వినోదాత్మకంగా సాగిపోయిన గీతగోవిందానికి సెకండ్ హాఫ్ లో మాత్రం రెండు చిన్న స్పీడ్ బ్రేకర్స్ ఎదురయ్యాయి. అయినా కూడా విజయ్ యాక్టింగ్ టాలెంట్, పరశురాం డైరక్టోరియల్ స్కిల్స్ వలన, స్మూత్ గా క్లైమాక్స్ కి చేరిపోయింది గీతగోవిందం. పరశురాం డైలాగ్స్ సినిమాకు బాగా కలిసొచ్చాయి. కాకపోతే ఎమోషనల్ టచ్ మాత్రం తగ్గింది. ఈ మధ్య తన మ్యూజిక్ తో  కాస్త నిరాశపరిచిన గోపీ సుందర్. మళ్ళీ ఫాంమ్ లోకి వచ్చాడు.. అయితే అతను అందించిన మ్యూజికల్ ట్యూన్స్ కి తెరమీద మాత్రం ఇంపాక్ట్ తగ్గింది.. అందరి నోళ్ళల్లో నానిన ఇంకేంకావాలి సాంగ్, పిక్చరైజేషన్ పరంగా ఇంకాస్తా బెటర్ గా ఉంటే బాగుండేది అనిపిస్తుంది.. ఆర్ ఆర్ బాగుంది.. సినిమాటోగ్రఫర్ మణికందన్ సినిమాటోగ్రఫీ సినిమా మూడ్ కు తగ్గట్టు బాగా సెట్అయ్యింది..  నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా, సినిమాను రిచ్ గా తీర్చిదిద్దారు.
ఓవర్ ఆల్ గా చెప్పాలంటే.. 
ఓవర్ ఆల్ గా చెప్పాలంటే.. మొదటి నుండి ఓ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ చూడబోతున్నారు అంటూ.. క్లియర్ హింట్స్ ఇస్తూ.. పబ్లిసిటీ చేసిన గీతగోవిందం టీం.. ఆ ప్రామిస్ ను సక్సెస్ ఫుల్ గా నెరవేర్చింది.. పాతకథే అయినా.. ఆధ్యాంతం వినోదాన్ని అందిస్తూ.. అక్కడక్కడా.. కొన్నిలోపాలను ఉన్నా.. వాటిని కవర్ చేస్తూ.. ఓ ఫర్ఫెక్ట్ ఎంటర్టైనర్ ను తీసుకువచ్చింది.. యూత్ కంటెన్ట్ మేజర్ ఎసెట్ గా ఉండటం,  విజయ్ దేవరకొండ క్రేజ్, లాంగ్ వీకెండ్ , ఇలా అన్ని అంశాలు కలిసి రావడంతో, బాక్సాఫీస్ దగ్గర ఊహించిన దానికన్న భారీగా సందడి చేసేలా.. ఉన్నారు గీతగోవిందం.
ప్లస్ పాయింట్స్
విజయ్, రష్మిక నటన
డైలాగ్స్, కామెడీ
డైరెక్షన్, మ్యూజిక్
ప్రొడక్షన్ వాల్యూస్
మైనస్ పాయింట్స్
రొటీన్ కథ
గెస్సింగ్ స్ర్కీన్ ప్లే
ఎక్కువైన నాటకీయత
రేటింగ్
3 /  5

Don't Miss