ప్రపంచ ప్రఖ్యాత రచయిత గాబ్రియేల్ గార్షియా మార్క్వెజ్

13:02 - December 4, 2016

సినీ నిర్మాతలు ఆ నవలకి రెండు మిలియన్ డాలర్లు అంటే 14 కోట్ల రూపాయలు ఇస్తామన్నారు.. కానీ, తన నవల చదివి తన పాఠకులే సినిమాగా ఊహించుకోవాలనుకున్నాడు. దాన్ని ఏ దర్శకుడూ తెరకెక్కించకూడదని పాఠకుల మీద తన అపార గౌరవాన్ని చాటిన రచయిత గురించి విన్నారా? నాలుగు సంవత్సరాలపాటు వెల్లకిలా పడుకొని మైఖేలేంజిలో తన ప్రపంచ ప్రఖ్యాత సిస్టిన్ ఛాపెల్ పెయింటింగ్ వేశాడు.. అంతే  శ్రద్ధగా తన ఒక్కో నవలనీ పదిహేను, ఇరవై, ముప్పై, నలభై ఏళ్ళపాటు చెక్కిన ఈ మహా శిల్పి రచనల్ని చదివారా? ఒక 80 ఏళ్ళ వృద్ధుడూ, మరో 70 ఏళ్ళ స్త్రీ, వారిద్దరి అజరామర ప్రేమ మీద తాను రాయదల్చుకొన్న నవల కోసం తనకొచ్చిన నోబెల్ బహుమతిని సైతం పణంగా పెట్టిన వ్యక్తి ఎవరో తెలుసా? ఆయనే ప్రపంచ ప్రఖ్యాత రచయిత గాబ్రియేల్ గార్షియా మార్క్వెజ్. ఆ సాహితీవేత్తను గురించిన ప్రత్యేక కథనం ఇవాళ్టి అక్షరం కార్యక్రమలో చూద్దాం....
'వన్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ సాలిట్యూడ్'.. 
వన్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ సాలిట్యూడ్.. ఈ  నవల ప్రారంభంలోనే కథ భవిష్యత్తులో మొదలయ్యి గతానికి ప్రయాణిస్తుంది. మళ్ళీ వర్తమానంలోకి వచ్చి భవిష్యత్తులోకి ప్రయాణిస్తుంది. కథా కాలంతో ముందుకూ వెనక్కూ వర్తులాకారంలో జరగటం, ఆకాశం నుంచి పసుప్పచ్చ పూలు రాలటం, ఒక పాత్ర ఆకాశంలోకి ఎగిరి వెళ్ళటం వంటి విచిత్రమయిన సంఘటనలూ, అంతకంటే విచిత్రమయిన పాత్రలూ నవల నిండా ఉంటాయి. పౌరాణిక జానపద కథల్లోలాగ ఏది నిజమో ఏది కల్పనో తెలీని అద్భుత రస కథా నిర్మాణం పాఠకుడిని కట్టి పడేస్తుంది.
పాఠకులను అమితంగా ఆకట్టుకున్న నవలలు  
ఇక మార్క్వెజ్ ఇతర రచనల్లోకి వెళితే.. ఆటమ్ ఆఫ్ ది పాట్రియార్క్, లవ్ ఇన్ ద టైమ్ ఆఫ్ కలరా పాఠకులను అమితంగా ఆకట్టుకున్నాయి. జనావళికి దూరంగా అంత:పురాల్లో, రాజదుర్గాల్లో, ఉంటూ పతనమైన ఒక నియంత కథతో మార్క్వెజ్ రాసిన నవల ఆటమ్ ఆఫ్  ది పేట్రియార్క్ అయితే... 80ఏళ్ల వృద్ధుడికి, 70ఏళ్ల స్త్రీ మధ్య అజరామర ప్రేమను చిత్రించిన నవల లవ్ ఇన్ ద టైమ్ ఆఫ్ కలరా.. ఇవీ యాభైఏళ్ల వన్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ సాలిట్యూడ్ విశేషాలు.. 
పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం...

 

Don't Miss