షరీఫ్ సతీమణి కన్నుమూత...

07:17 - September 12, 2018

ఇస్లామాబాద్ : పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ భార్య బేగం కుల్సుమ్‌ మరణించారు. చాలా కాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆమె మంగళవారం లండన్‌లో మృతి చెందారు. ఆమె మృతదేహానికి పాకిస్తాన్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. జైల్లో ఉన్న నవాజ్‌షరీఫ్ ఆయన కుమార్తె, అల్లుడు పెరోల్‌పై వచ్చి అంత్యక్రియలకు హాజరు కానున్నారు. కుల్సుమ్‌ బేగం మృతిపట్ల  తీవ్ర సంతాపం ప్రకటించిన పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌...ఆమె అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తామన్నారు.

 

Don't Miss