గోదారిలో దూకిన వివాహిత...

16:16 - July 13, 2018

జగిత్యాల : ఆత్మహత్యకు ప్రయత్నించిన వివాహితను జాలర్లు కాపాడారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా ధర్మపురం మండలంలోని రాయపట్నం వద్ద చోటు చేసుకుంది. కళ్యాణి అనే వివాహిత రాయపట్నం వంతెన మీదకు శుక్రవారం వచ్చింది. కొద్దిసేపు అటూ..ఇటూ తిరిగిన కళ్యాణ్ ఎవరూ లేని సమయం అనుకుని వంతెనపై నుండి గోదావరిలోకి దూకింది. కిందకు దూకుతున్నది జాలర్లు చూశారు. వెంటనే మునిగిపోతున్న కళ్యాణినిపైకి లేపారు. అనంతరం తెప్ప సహాయంతో ఒడ్డుకు చేర్చారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Don't Miss