వాతావరణ శాఖపై 'కేసు' పెట్టిన 'రైతన్న'లు!!..

11:42 - August 9, 2018

మహారాష్ట్ర : రైతే రాజ్యానికి వెన్నెముక అన్నారు. రైతన్న అలిగితే ఎవరికి అన్నమే వుండదు..కడుపు నిండదు. రైతు లేనిదే రాజ్యం లేదు. అందుకే రైతన్నను అన్నదాత అన్నారు. భారతదేశం వ్యవసాయ ఆధారిత దేశం..దేశ ప్రగతికి రైతే వెన్నెముకలాంటివాడు. మరి ఈనాడు రైతు అంటే విలువలేకుండా పోయింది. రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు హామీలతోనే సరిపెడుతున్నాయి. మరోపక్క వరుణుడు కూడా రైతన్నపైనే అలుగుతున్నాడు. కోపం లేని కోపం రాని రైతన్న అలిగితే..క్రాప్ హాలిడే ప్రకటిస్తే..దేశమే కాదు..ప్రపంచమే స్థంభించిపోతుంది. ఆకలి కరాళనృత్యం చేస్తుంది. కానీ అన్నదాత అన్నమే పెడతాడు..ఆకలిని దరి చేరనివ్వడు. అందుకే తనను తాను చంపుకుంటాడు తప్ప ఎవరిపైనా రైతన్న కోపగించుకోడు..కానీ ఆ రైతన్నకు కోపం వస్తే..ఎవరిమీదనైనా సరే పోరాడుతాడు. తన పంటను కాపాడుకునేందుకు రైతన్న దేనికైనా తెగిస్తాడు..ఈ నేపథ్యంలో కొందరు రైతన్నలు ఓ విచిత్రమైన పనిచేశారు. నారు వేసిన రైతన్న వర్షం కోసం ఆకాశం వంక ఆశగా చూసాడు. వర్షాలు పడతాయో లేదోనని ఆందోళన పడ్డాడు. వర్షాలు పడతాయో లేదో చెప్పేందు ఓ శాఖ కూడా వుంది. కానీ అదెప్పుడు సరైన సమాచారాన్ని అందివ్వదు. దీనికి నిరసనగా రైతన్నలు వాతావరణ శాఖ తప్పుడు సమాచారం చెప్పిందనీ ఆ సంస్థ డైరెక్టర్ పై కేసు పెట్టారు..అవును నిజమండీ..కావాలంటే ఆ వివరాలు చూడండి..
వాతావరణ శాఖ డైరెక్టర్ పై ఫిర్యాదు చేసిన మలాఠ్వాడ రైతులు..
వానలు పడక ఒకసారి..నకిలీ విత్తనాలతో మరోసారి..వెరసి రైతన్నలు అప్పుల ఊబిలోకి కూరుకుపోతున్నారు. తీవ్రంగా నష్టపోతున్నారు. రైతన్న నష్టపోతే మనకేమిలో అనుకోవటానికి వీలులేదు..రైతన్న నష్టపోతే దేశానికే నష్టం. ఈ క్రమంలో నష్టాలపాలైన రైతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటే..మరికొందరు వున్న ఊరును..కన్నతల్లిలాంటి పొలాన్ని అమ్ముకుని వలస బాట పడతున్నారు. కానీ రైతన్నలలో మరాఠ్వాడా రైతులు మాత్రం ఫుల్ డిఫరెంట్. వాతావరణ శాఖ వర్షపాతంపై సరైన అంచనాలు ఇవ్వకపోవడంతో ఏకంగా సంస్థ డైరెక్టర్ పై మహారాష్ట్రలోని మలాఠ్వాడ రైతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వర్షాలు పడతాయన్న సంస్థ..పడని వర్షాలు..కేసు నమోదు..
ఈ సారి రుతుపననాల సందర్భంగా మంచి వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో మరఠ్వాడా ప్రాంతానికి చెందిన రైతులు తమవద్ద ఉన్న మొత్తం నగదుతో పంటల్ని సాగుచేశారు. అయితే తొలికరి వర్షం మినహా వాన జాడలేకపోవడంతో ఆగ్రహం చెందిన రైతన్నలు.. భారత వాతావరణ శాఖ పుణె డైరెక్టర్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక్కడి అధికారులు ఎరువులు, పురుగు మందుల కంపెనీలతో కుమ్మక్కై తప్పుడు అంచనాలను ఇచ్చారని ఆరోపించారు.

ఐపీసీ 420 సెక్షన్ కింద కేసు నమోదుచేయాలని డిమాండ్..
ఈ మేరకు రైతు సంఘం స్వాభిమాని షేట్కారీ సంఘటన మరఠ్వాడా ప్రాంత చీఫ్ మాణిక్ కదమ్ రైతులతో కలసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులపై ఐపీసీ 420 సెక్షన్ కింద కేసు నమోదుచేయాలని డిమాండ్ చేశారు. కాగా, ఈ విషయమై స్పందించేందుకు వాతావరణ శాఖ అధికారులెవరూ అందుబాటులోకి రాలేదు.

Don't Miss