కన్నీటి వీడ్కోలు మధ్య..

21:30 - December 4, 2016

లక్షలాది మంది అభిమానుల కన్నీటి వీడ్కోలు మధ్య... క్యూబా విప్లవయోధుడు ఫిడెల్ కాస్ట్రో అంత్యక్రియలు ముగిశాయి. కాస్ట్రో చితాభస్మాన్ని శాంటియాగాలో సంప్రదాయబద్ధంగా సమాధి చేశారు. అంతకుముందు కాస్ట్రో చితాభస్మాన్ని ప్రజలు పెద్దఎత్తున సందర్శించారు. ఆయన అంత్యక్రియల కార్యక్రమానికి ప్రపంచం నలుమూలల నుంచి వివిధ దేశాధినేతలు హాజరయ్యారు. క్యూబా విప్లవ యోధుడు, మాజీ అధ్యక్షుడు ఫిడెల్‌ క్యాస్ట్రో అంత్యక్రియలు ఆదివారం శాంటియాగోలో ముగిశాయి. క్యూబా విప్లవ జ్యోతి ఫిడెల్‌ కాస్ట్రో చితాభస్మం ఉన్న కలశాన్ని శాంటా ఐఫిజెనియా స్మశానవాటికలో సంప్రదాయ బద్ధంగా సమాధి చేశారు. ఈ కార్యక్రమానికి ప్రపంచం నలుమూలల నుంచి వివిధ దేశాధినేతలు హాజరై క్యాస్ట్రోకు నివాళలర్పించారు.

27న దహన సంస్కారాలు..
కాస్ట్రో భౌతిక కాయానికి గత ఆదివారం నవంబర్‌ 27న దహన సంస్కారాలు నిర్వహించారు. కాస్ట్రో రాసుకున్న విల్లు మేరకే ఆయన మృతదేహాన్ని దహనం చేశారు. ఆ తర్వాత కాస్ట్రో చితాభస్మం ఉన్న పాత్రను క్యూబా జాతీయ పతాకం కప్పిన అద్దాలపెట్టెలో ఉంచి ప్రజల సందర్శనార్థం వివిధ ప్రాంతాల్లో ఊరేగించారు. హవానాలో రెండురోజుల శ్రద్ధాంజలి అనంతరం కాస్ట్రో చితాభస్మం ఊరేగింపు గత బుధవారం ప్రారంభమైంది. గురువారం అర్ధరాత్రి ఆ చితాభస్మం శాంటాక్లారాలోని ఆయన ఉద్యమ సహచరుడు చెగువెరా సమాధి మ్యూజియం ఉన్న సముదాయానికి చేరింది. హవానా నుంచి పలు పట్టణాల మీదుగా నాలుగు రోజుల పాటు 800 కిలోమీటర్ల మేర ప్రయాణించిన క్యాస్ట్రో చితాభస్మపు పేటిక.. ఆదివారం శాంటియాగోకు చేరుకుంది. శాంటాఐఫిజెనియా స్మశానవాటికలో.. 19వ శతాబ్దపు స్వాతంత్య్ర యోధుడు జోస్ మార్టి సమాధి పక్కన.. కాస్ట్రో చితాభస్మాన్ని సమాధి చేశారు. ఈ కార్యక్రమానికి ప్రపంచం నలుమూలల నుంచి వివిధ దేశాధి నేతలు, అధికారులు హాజరయ్యారు.

Don't Miss