తినే తిండిపైన కూడా ఆంక్షలు : మిడియం బాబురావు

17:49 - June 9, 2018

విశాఖ : కేంద్ర ప్రభుత్వం తినే తిండిపైన కూడా ఆంక్షలు పెడుతుందని మాజీ ఎంపీ మిడియం బాబురావు మండిపడ్డారు. విశాఖలో నిర్వహించిన దళిత ఆదివాసీ సమతా జాతీయ సెమినార్ లో ఆయన పాల్గొని, మాట్లాడారు. ఇంటికి ఒక అతిథి వస్తే మంచి పెయ్య దూడను కోసి వారికి సంతృప్తికరంగా భోజనం పెట్టమని శ్లోకం చెబుతుందన్నారు. 'ఆవు మాంసం నీవు తిన్నప్పుడేమో అది రైటా ? మేము తింటే తప్పా... ఇదెక్కడి సిద్ధాంతమని..ఇది లౌకికరాజ్యమా ? అని అన్నారు. మనం ఏం తినాలో తేల్చుకునే హక్కు మనకు లేదా..? ఏ దేవున్ని పూజించుకోవాలో మనం హక్కు లేదా.? అని ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వేషన్లు పూర్తిగా తొలగించాలని ప్రయత్నిస్తున్నాయని పేర్కొన్నారు. దానికి ముందు షరతుగా రిజర్వేషన్లు అమలు కాకుండా చేసేందుకు రకరకాల ప్రయోగాలు చేస్తున్నాయని పేర్కొన్నారు. అర్హత లేనటువంటి బోయలను ఏ రకంగా ఎస్టీలో కలుపుతారని ప్రశ్నించారు. బోయలను ఎస్టీలో చేర్చేందుకు కావాల్సిన ఐదు అంశాల్లో ఏ ఒక్కటి బోయలకు లేదని 2010లో సుబ్రమణ్యం కమిటీ చెప్పిందని గుర్తు చేశారు. ప్రత్యేకభాష , 
పోడు వ్యవసాయం, ప్రత్యేక సంస్కృతి సంప్రాదాయాలు, ప్రాథమిక ఉత్పత్తి పద్ధతులు వాళ్ల దగ్గర లేవు, వారు నాగరిక ప్రపంచానికి దూరంగా కొండల్లో, కోనల్లో లేరు అని చెప్పిందన్నారు. ఏ క్రెడిటేరియా సరిపోని వాళ్లు బీసీ..ఏలోనే అర్హులని ఆ రోజు కమిటీ చెప్తే ఇప్పుడు నీ తొత్తుల చేత లేనిపోని ఒక నివేదిక తెచ్చి... నిండు శాసన సభను తప్పుదోవపట్టించి..తీసుకెళ్లి వారిని ఎస్టీలో చేర్చారని తెలిపారు. ఎస్టీలో చేర్చేందుకు బోయలకు ఎలాంటి అర్హత లేదన్నారు. 

 

Don't Miss