శ్రీవారి భక్తుల పరేషాన్..

09:59 - December 8, 2016

తిరుమల : భక్తుల జేబులకు భారీగా చిల్లుపడుతోంది.. ఆర్‌బీఐ సర్వీస్‌ చార్జీలను రద్దుచేసినా ఇక్కడ ఇంకా వసూలు చేస్తూనే ఉన్నారు.. పవిత్ర పుణ్యక్షేత్రంలో భక్తులకు మరింత మెరుగ్గా సేవలు అందించాల్సిందిపోయి అదనపు భారం మోపుతున్నారు..

తిరుమలలో భక్తులు నిలువుదోపిడీ
తిరుమలలో భక్తులు నిలువుదోపిడీకి గురవుతున్నారు.. స్వైపింగ్‌ మిషన్‌ద్వారా చెల్లింపులకు ఇంకా సర్వీస్‌ చార్జీలు చెల్లిస్తూనేఉన్నారు.. ఇలా రోజుకు దాదాపు 45లక్షల రూపాయల్ని అదనంగా చెల్లిస్తున్నారు..

డెబిట్‌ కార్డులద్వారా కొనుగోళ్లపై సర్వీస్‌ చార్జీలు రద్దు
పెద్దనోట్ల రద్దు తర్వాత ఆన్‌లైన్‌ లావాదేవీలను ప్రోత్సహించేందుకు కేంద్రం చాలా ప్రోత్సాహకాలు ప్రకటించింది.. ఇందులోభాగంగా డెబిట్‌ కార్డులద్వారా కొనుగోళ్లపై ఆర్‌బీఐ సర్వీస్‌ చార్జీలు రద్దు చేసింది.. ఈ నిర్ణయం ప్రకటించి దాదాపు నాలుగు రోజులవుతున్నా తిరుమలలోమాత్రం బ్యాంకు అధికారులు ఏమాత్రం పట్టించుకోలేదు.. స్వైపింగ్‌ మిషన్ల ద్వారా జరిగే రూంల బుకింగ్‌లు, వీఐపీ బ్రేక్‌ దర్శనం టికెట్లు, ప్రసాదం, పుస్తక విక్రయాలన్నింటికీ 2.07శాతం రుసుమును అధికారులు వసూలు చేస్తున్నారు..

సర్వీస్‌ చార్జీలు రద్దు చేస్తే సాఫ్ట్‌వేర్‌లో మార్పులు తప్పనిసరి
తిరుమలకు రోజూ 70నుంచి 80వేలమంది యాత్రికులు శ్రీవారి దర్శనానిని వస్తుంటారు.. వారాంతంలోఅయితే ఈ సంఖ్య లక్షకుపైగానే ఉంటుంది.. నోట్ల రద్దు తర్వాత ఇక్కడ అన్ని లావాదేవీల్ని స్వైపింగ్‌ మిషన్‌ ద్వారా చేపట్టారు.. ఈ పేమెంట్ల బాధ్యతల్ని గేట్‌వే సంస్థలు నిర్వహిస్తున్నాయి.. ఈ సంస్థలకు కమిషన్‌ ఇచ్చేందుకే ఇలా ఎక్కువ వసూలు చేస్తున్నారని తెలుస్తోంది.. ఈ చార్జీల్ని రద్దు చేస్తే సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేయాలి.. ఈ పనిని అధికారులు పట్టించుకోకపోవడంతో భక్తులపై మరింత భారం పడుతూనే ఉంది..

దేవడి సన్నిధిలోనే సర్వీస్‌ చార్జీల మోత
సాక్షాత్తూ దేవడి సన్నిధిలోనే సర్వీస్‌ చార్జీల మోతతో భక్తులు అల్లాడిపోతున్నారు.. ఏడుకొండలపైనే ఈ పరిస్థితి ఉంటే ఇతర ప్రాంతాల్లో సంగతేంటని అధికారుల్ని భక్తులు ప్రశ్నిస్తున్నారు. 

Don't Miss