'టోల్' తీస్తారా ? పొడిగిస్తారా ?

09:17 - December 1, 2016

పెద్ద నోట్లు రద్దు..సామాన్యుడిని వణికించేస్తోంది. పేదోడి సమస్య వర్ణనాతీతంగా ఉంది. పెద్దనోట్ల రద్దు పుణ్యమా అని వాహనదారులకు గత కొన్ని రోజులుగా ట్యాక్స్ కట్టే బాధ తప్పినట్లైంది. చిల్లర సమస్స తలెత్తడం..పలు టోల్ గేట్ల వద్ద ఆందోళనకర పరిస్థితులు ఏర్పడ్డాయి. దేశ వ్యాప్తంగా ఈ సమస్య తలెత్తడంతో కేంద్రం కళ్లు తెరిచింది. వెంటనే టోల్ ట్యాక్స్ రద్దు చేస్తున్నట్లు..కొన్ని రోజుల వరకు ఇది అమల్లోఉ ఉంటుందని ప్రకటించడంతో వాహనదారులు ఊరట చెందారు. నవంబర్ 11వ తేదీ అర్ధరాత్రి నుండి టోల్ ట్యాక్స్ ను తాత్కాలికంగా రద్దు చేసిన అనంతరం పలుమార్లు పొడిగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. చివరిగా డిసెంబర్ 2వ తేదీ అర్ధరాత్రి వరకు అమలు చేస్తామని కేంద్రం ప్రకటించింది. ప్రస్తుతం ప్రభుత్వం విధించిన గడువు ముగిసిపోవడంతో రేపటి నుండి టోల్ ట్యాక్స్ కట్టాలా ? అని వాహనదారులు ఆలోచిస్తున్నారు. డిసెంబర్ 2 అర్ధరాత్రి నుంచి అదే నెల 15 వరకు రూ. 500 పాత నోట్లతో టోల్ ట్యాక్స్ చెల్లింపునకు అవకాశం కల్పించారు. మరి మళ్లీ చిల్లర సమస్య ఏర్పడుతుందా ? ట్యాక్స్ రద్దు పొడిగిస్తారా ? అనేది వేచి చూడాలి. 

Don't Miss