రెచ్చిపోతున్న సైబర్‌ నేరగాళ్లు

08:52 - December 4, 2016

హైదరాబాద్ : పెద్ద నోట్ల రద్దు తర్వాత సైబర్‌ నేరాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. నోట్ల రద్దు తర్వాత నగదు లావాదేవీలు తగ్గి..మొబైల్‌ బ్యాంకింగ్‌ లావాదేవీలు పెరగడంతో ఇదే అదనుగా సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. సచివాలయ ఉద్యోగి నుంచి ఏకంగా 87 వేల రూపాయలు మాయం చేశారు సైబర్‌ నేరగాళ్లు. టాన్స్‌పోర్టు డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న శంకర్‌ నిన్న ఉదయం జీతం డబ్బులు తీసుకుందామని బ్యాంకుకు వెళ్లాడు. అయితే క్యూలో నిలబడి ఉండగానే..శంకర్‌ మొబైల్‌కు బ్యాంకు అధికారులమంటూ 16 ఫోన్‌కాల్స్‌ వచ్చాయి. పాత ఏటీఎం కార్డు బ్లాక్‌ అయింది..కొత్త ఏటీఎం కార్డు ఇస్తున్నాము..మీ కార్డు నెంబర్‌ చెప్పండని అడగ్గానే..అది నమ్మిన శంకర్‌ పిన్‌నెంబర్‌తో సహా అన్నీ చెప్పేశాడు. ఇంకేముందు క్షణాల్లో శంకర్‌ అకౌంట్లో ఉన్న 87 వేల నగదు మాయం అయింది. విషయం తెలుసుకున్న శంకర్‌ లబోదిబోమంటున్నాడు. 

 

Don't Miss