'వర్మ'కు నోటీసులు..!

09:09 - December 1, 2016

రామ్ గోపాల్ వర్మ..వివాదాస్పదాలకు కేరాఫ్. ఆయన ఏదీ చేసినా సంచలనమే. ట్విట్టర్ లో పలు వివాదాస్పద ట్వీట్స్ చేస్తూ ఎప్పుడూ వార్తల్లోకి ఎక్కుతుంటారు. ఆయన చేసే సినిమాలు కూడా వివాద్సాపదమౌతుంటాయి. తాజాగా 'వంగవీటి' సినిమా తీస్తున్నానంటూ 'వర్మ' ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే షూటింగ్ జరిపే సమయంలో 'వర్మ'కు కొన్ని బెదిరింపులు వచ్చినట్లు టాక్. ఎన్ని బెదిరింపులు వచ్చినా తాను సినిమా చేసి తీరుతానని గతంలో ఆయన పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే 'వంగవీటి' చిత్ర ఆడియో వేడుకను విజయవాడలోని కోనేరు లక్ష్మయ్య కాలేజ్ గ్రౌండ్స్ లో డిసెంబర్ 3న జరపనున్నట్టుగా 'వర్మ' ప్రకటించారు. దీనితో ఈ వివాదం మరింత ఎక్కువైంది. విజయవాడలో ఆడియో వేడుకలు జరిపితే అల్లర్లు జరగడం ఖాయమని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే తాజాగా 'వర్మ'తో పాటు చిత్ర నిర్మాత 'దాసరి కిరణ్ కుమార్' హైకోర్టు నుండి నోటీసులు అందాయని వార్తలు వెలువడుతున్నాయి. 'వంగవీటి రంగా'ను నెగటివ్ కోణంలో చూపే ప్రయత్నం జరిగిందని పిటిషన్ దాఖలైనట్లు టాక్. మరి ఈ పిటిషన్ దాఖలు నిజం అయితే ఎలాంటి నిర్ణయం వెలువడుతుందో వేచి చూడాలి. 

Don't Miss