కొతిమీర...ఔషద గుణాలు...

12:32 - August 21, 2017

వంటకాలకు రుచి, వాసన రావాలంటే కొతిమీర ఆ వంటల్లో కొతిమీర ఆకు వేయాల్సిందే. చూడడానికి సున్నితంగా, మంచి లేత ఆకుపచ్చని రంగు మంచి వాసనతో ఇట్లే ఆకర్షిస్తుంది కొతిమీర ఆకులు. ప్రతినిత్యం మనం వంటకాలలో వాడే కొతిమీర వల్ల ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసుకుందాం.

కొత్తిమీరలో పొటాషియం, ఇనుము, విటమిన్ ఎ, కె మరియు C, ఫోలిక్ యాసిడ్, మెగ్నీషియం మరియు కాల్షియం అధికంగా ఉన్నాయి. దీనికి ఉన్న ఔషధ లక్షణాల వలన దీనిని ప్రపంచవ్యాప్తంగా వాడుతున్నారు. మనలో జీర్ణక్రియ సజావుగా జరిగేట్లుగా చేస్తాయి. మలబద్ధకాన్ని కూడా నివారిస్తాయి. జీర్ణక్రియకు కావాలిసిన యంజైమ్స్ మరియు రసాల ఉత్పత్తి చేయటంలో సహాయపడతాయి.

కొత్తిమీరలో ఫోలిక్ ఆమ్లం, విటమిన్ సి, విటమిన్ ఎ మరియు బేటా-కెరోటిన్ వంటి అనేక ముఖ్యమైన విటమిన్లు ఉన్నాయి. కొత్తిమీర ఆకులు మరియు ధనియాల్లో మనకు రోజువారీ మధుమేహంతో బాధపడేవారు రోజూ క్రమం తప్పకుండా కొత్తిమీర రసం త్రాగితే మంచిది.

కలుషిత ఆహారం, నీరు వల్ల కలిగే కలరా, టైఫాయిడ్, విరేచనాలు వంటి వ్యాధులు కూడా రోజూ మీరు కొత్తిమీరను ఆహారంలో క్రమం తప్పకుండా తీసుకుంటే, ఆ వ్యాధులు మీ దరిదాపుల్లోకి కూడా రావు.

దీనిలో ఐరన్ పదార్ధం ఎక్కువగా ఉండటం వలన, ముఖ్యంగా స్త్రీలు కొత్తిమీర ఎక్కువగా తీసుకోవటం చాలా మంచిది. స్త్రీల ఋతుక్రమంలో, వారు రక్తాన్ని కోల్పోతుంటారు. దీనివలన స్త్రీలలో ఐరన్ లోపం ఎక్కువగా ఉంటుంది. స్త్రీలు తీసుకునే ఆహారంలో కొత్తిమీర ఎక్కువగా వాడటం వలన ఈ లోపాన్ని చాలావరకు సరిదిద్దుకోవచ్చు.

కొత్తిమీరవాడకం వలన కండ్లకలక, కళ్ళఎరుపు, దురద మరియు వాపు వంటి వాటికి ఉత్తమ ఉపశమనం కలుగుతుందని పరిశోధనలు చెపుతున్నాయి. కొత్తిమీర తామర, దురద చర్మం, దద్దుర్లు మరియు మంట వంటి వివిధ చర్మ వ్యాధుల ఉపశమనానికి చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఉడికించిన కొత్తిమీర నీటితో పుక్కిలించి ఉమ్మివేయటం వలన నోటిపూత నయమవుతుంది.

ధనియాలు లేదా కొత్తిమీర పేస్ట్ కు కొద్దిగా తేనె, పసుపు కలపండి. ఈ పేస్ట్ ను ముఖానికి మాస్క్ లాగా వేయండి. ఇలా చేయటం వలన ముఖం మీద ఉండే మొటిమలు, ఆక్నే, బ్లాక్ హెడ్స్ వంటివి మటుమాయమవుతాయి.

ఇన్ని ప్రయోజనాలు ఉన్న కొత్తిమీర, ధనియాలను ఎక్కువగా తీసుకున్నందువలన అప్రయోజనాలు కూడా ఉన్నాయండోయి! వీటిని ఎక్కువగా తీసుకుంటే లివర్ లో సమస్యలు మొదలవుతాయి. గర్భిణి స్త్రీలు, పాలిచ్చే తల్లులు కూడా వీటిని తీసుకోకుండా ఉండటమే మంచిది. తీసుకున్నా చాలా తక్కువ పరిమాణంలో తీసుకోవాలి.

Don't Miss