కాంట్రాక్ట్‌ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి : ఏవీ నాగేశ్వర్‌రావు

13:58 - August 13, 2018

ఆంధ్రప్రదేశ్‌లో కాంట్రాక్ట్‌ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు ఆందోళన బాటపట్టారు. ఈరోజు తమ సమస్యలు పరిష్కరించాలని చలో విజయవాడ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. క్రమబద్దీకరణ, సమాన పనికి సమాన వేతనం.. శ్రమదోపిడి రద్దు తదితర డిమాండ్లతో వాళ్లు ఆందోళన చేస్తున్నారు. వారి సమస్యలు వారు ఆందోళనకు దారితీసిన పరిస్థితులు.. ప్రభుత్వ విధానంపై జనపథంలో సీఐటీయూ నాయకులు ఏవీ నాగేశ్వర్‌రావు పాల్గొని, మాట్లాడారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రెగ్యులర్ చేయాలన్నారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని కోరారు. ఈఎస్ఐ, పీఎఫ్, ఐఆర్ చెల్లించాలని చెప్పారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం....

Don't Miss