నో క్యాష్ కష్టాలు కంటిన్యూ..

09:03 - December 8, 2016

హైదరాబాద్ : పాత పెద్దనోట్లు రద్దు చేసిన నేటికి సరిగ్గా 30రోజులయ్యింది. సామాన్యుల ఇంట్లో ఏ శుభకార్యమూ జరగటంలేదు. నిర్ణయించుకున్న శుభకార్యాలను కూడా నగదు సమస్యతో వాయిదా వేసుకునే పరిస్థితులను సామాన్యులు ఎదుర్కొంటున్నారు. కానీ పెద్దవారి ఇంటమాత్రం పెళ్లి బాజాలు మ్రోగుతూనే వున్నాయి. నుదుటిన పెండ్లి తిలకం దిద్దుకుని..బుగ్గన చుక్క పెట్టుకుని పెండ్లి కుమారులు..కుమార్తెలు బ్యాంకులకు వచ్చి నగదు కోసం పడరాని పాట్లు పడుతూనే వున్నారు. 30 రోజులు గడిచినా సామాన్యుల కరెన్సీ కష్టాలు మాత్రం ఏమాత్రం తగ్గటంలేదు..బ్యాంకుల్లో నో క్యాష్ బోర్డులు..ఏటీఎంల వద్ద అవుటాఫ్ సర్వీస్ బోర్డు దర్శనిమిస్తూనే వున్నాయి. రూ.రెండువేల నోట్లకు దొరకని చిల్లరతో నిత్యావసరాలకు ప్రజలు ఇబ్బందులు పడుతూనే వున్నారు. 30రోజులైనా ఇంతవరకూ రూ.500ల నోట్లు దొరకని పరిస్థితి నెలకొంది. నగదు పెట్టిన కాసేపట్లోనే ఏటీఎంలు ఖాళీ అవుతున్న పరిస్థితులు కొనసాగుతూనే వున్నాయి. పలు సెంటర్లలో ఏటీఎంలు పనిచేయటంలేదు. అబిట్స్ ఎస్బీహెచ్ వద్ద ఎటువంటి పరిస్థితి వుందో చూడండి..

 

Don't Miss