'చిరు' టీజర్ నేడే..!

09:58 - December 8, 2016

మెగాస్టార్ చిరంజీవిని ఎప్పుడెప్పుడు తెర మీద చూద్దామా అని అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. చిత్రంలో ఎలా ఉన్నాడో..ఎలాంటి ఫైట్లు..డ్యాన్స్ లు చేశారోనని అభిమానులు ఆతృతగా ఉన్నారు. చిత్రానికి సంబంధించిన పలు ఫొటోలు రిలీజైన సంగతి తెలిసిందే. దాదాపు 8 సంవత్సరాల తరువాత 'చిరు' నటిస్తున్న 'ఖైదీ నెంబర్ 150'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. 150వ చిత్రం కావడంతో 'చిరు' కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పలు వార్తలు సోషల్ మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదలవుతోందని తెలుస్తోంది. రేపటి నుండి చిత్ర టీజర్ 'ధృవ' ప్రదర్శింపపడే అన్ని థియేటర్స్ లలో ప్రదర్శితం కానుందని తెలుస్తోంది. విజయవాడలో చిత్ర ఆడియోను రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోందట.
సంక్రాంతి కానుకగా జనవరిలో సినిమా రిలీజ్ అవుతుందన్న విషయం తెలిసిందే. మెగా వారసుడు 'రామ్ చరణ్' నిర్మిస్తున్న ఈ చిత్రం తమిళ సూపర్ హిట్టు 'కత్తి'కి రీమేక్ గా తెరకెక్కుతోంది. 'వినాయక్' డైరెక్షన్ లో రూపొందుతున్న ఈ చిత్రంలో 'చిరంజీవి' పక్కన 'కాజల్' హీరోయిన్ గా నటిస్తోంది. యాక్షన్ డ్రామాకి మేసేజ్ ని జోడించి ఈ మూవీని వెరీ ఇంట్రెస్ట్ గా వినాయక్ మలుస్తున్నట్లు సమాచారం. మరి టీజర్ ఎలా ఉంటుందో వేచి చూడాలి. 

Don't Miss