పట్టపగలే నరబలి!!..

21:25 - July 27, 2018

కృష్ణా : నూజివీడు మండటం యనమదలలో క్షుద్రపూజలు కలకలం సృష్టించాయి. దీంతో స్థానికులంతా తీవ్రంగా భయాందోళనలకు గురవుతున్నారు. పట్టపగలే క్షుద్రపూజలకు ఏడుగురు వ్యక్తులు సర్వం సిద్ధం చేసుకున్నారు. చంద్రగ్రహణం సందర్భంగా చిన్నం ప్రవీణ్ అనే 32 సంవత్సరాల వ్యక్తిని నరబలి ఇచ్చేందుకు ఏడుగురు వ్యక్తులు అన్ని విధాలుగా సిద్ధమయ్యారు. దీని సంబంధించిన పూజా సామాగ్రిని సిద్ధం చేసుకున్నారు. ప్రవీణ్ ను నరబలి ఇచ్చేందుకు గుంతలు తవ్వారు. ఈ కుట్రను పసిగట్టిన ప్రవీణ్ అక్కడి నుండి పారిపోయి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనాస్థలికి చేరుకున్నారు. దీంతో సదరు నిందితులు పరారయ్యేందుకు యత్నించగా వారిలో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. కాగా ఈ క్షద్రపూజల తతంగం కొనసాగుతున్నట్లుగా స్థానికులు అనుమానాలు వ్యక్తంచేశారు. 

Don't Miss