సర్కార్ పై సీపీఎం పాదయాత్ర ప్రభావం : తమ్మినేని

13:41 - December 6, 2016

కామారెడ్డి : 50 రోజులు కాదు 500ల రోజైనా రాష్ట్రంలోని సమస్యలు తెలుసుకునేందుకు సరిపోవని ఆస్థాయిలో సమస్యలు పేరుకుపోయాయన్నారు. అత్యధికంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళగురించి ప్రజలు ఎంతగానో ఆశపడుతున్నారనీ..ఈ హామీ నెరవేర్చకపోవటంతో ప్రజల్లో ఆందోళన నెలకొందని..ఈ విషయంపై ప్రజలు వందల వేలాదిగా వినతిపత్రాలు పాదయాత్ర సభ్యులు ఇస్తున్నారని తెలిపారు. మరో సమస్యలు దళితులకు ప్రభుత్వం పంపిణీ చేస్తానని మూడెకరాల భూమి కూడా మరొకటని తెలిపారు. ప్రభుత్వం ఇస్తానన్న భూమి ఎలాగున్నా ఆదివాసీ, దళితుల వద్ద నుండి పోడు భూములను హరిత హారం పేరుతో లాక్కుంటున్నారని విమర్శించారు. మెదక్, మహబూబ్ నగర్ వంటి దళితులపై వివక్ష తీవ్రంగా వుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో దిగువ వర్గాలకు బడ్జెట్ లో కేటాయించకుండా ప్రభుత్వం ఎంగిలిమెతుకులు విదిలిస్తోందని విమర్శించారు. రానున్న కాలంలో అట్టడుగువర్గాల నుండి తీవ్ర ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చే వాతావరణం కనిపిస్తోందన్నారు. సీపీఎం పాదయాత్ర రాష్ట్రంలో సంచలనం కలిగిస్తోందని సర్కార్ లో ఒక రకమైన కదలిక కలిగిస్తోందన్నారు. పాదయాత్రలో భాగంగా ప్రభుత్వానికి సీపీఎం రాస్తున్న లేఖలు సర్కార్ లో కలవరం సృష్టిస్తోందని తెలిపారు. దానికి ప్రభుత్వం ప్రకటలే తార్కాణమన్నారు. లేఖల్లో లేవనెత్తిన సమస్యలపట్ల సర్కార్ లో కదలిక వస్తోందని తెలిపారు. పార్టీ లేని ప్రాంతాల్లో కూడా పాదయాత్రకు మంచి స్పందన వస్తోందని ఈ సందర్భంగా తమ్మినేని పేర్కొన్నారు.

50రోజులు పూర్తి చేసుకున్న పాదయాత్ర
మహాజన పాదయాత్ర 50రోజులు పూర్తి చూసుకుంది. యాత్రలో ఊరూరా లాల్‌జెండా-నీల్‌జెండాలు రెపరెపలాడుతున్నాయి. యాత్రలో ప్రజలు తమ బాధల్ని వాపక్షనేతలతో చెప్పుకుంటున్నారు. తెలంగాణరాష్ట్రం సిద్ధించిన తర్వాత కూడా ప్రజాసమస్యలు పరిష్కారం కాలేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అంటున్నారు. సామాజిక న్యాయసాధనలో లెఫ్ట్‌పార్టీలు ఐక్యంగా ముందుకు సాగుతాయన్నారు.

Don't Miss