యుఏఈ పెద్ద మనసు..కేరళకు రూ.700ల కోట్లు..

17:09 - August 21, 2018

కేరళ : భారీ వర్షాలతో అతలాకుతలమైన కేరళకు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ ఆపన్న హస్తం అందించింది. రాష్ట్రాన్ని ఆదుకునేందుకు 700 కోట్ల భారీ ఆర్థిక సహాయాన్ని ప్రకటించినట్లు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ వెల్లడించారు. అబుదాబి యువరాజు ప్రధాని మోదితో ఫోన్లో మాట్లాడి ఈ విషయం చెప్పారని సిఎం తెలిపారు. కేరళకు అండగా నిలుస్తున్న ఆయా దేశాలు, రాష్ట్రాలకు సిఎం కృతజ్ఞతలు తెలిపారు. యూఏఈ విజయంలో కేరళ ప్రజల పాత్ర ఎంతో ఉందని, వారిని ఆదుకునేందుకు సాయం చేస్తామని ఆ దేశ ఉపాధ్యక్షుడు షేక్‌ మహ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తామ్‌ ఇటీవల ట్వీట్‌ చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే నిర్వహించిన ప్రధాని మోది కేరళకు 500 కోట్లు ఆర్థిక సహాయం ప్రకటించిన విషయం తెలిసిందే. కేరళలో వరదల కారణంగా సుమారు 20 వేల కోట్ల నష్టం వాటిల్లింది.

Don't Miss