సంచారజాతులవారిని ప్రభుత్వం ఆదుకోవాలి : ఎంబీసీ నేత ఆశయ్య

21:02 - December 3, 2016

కామారెడ్డి : దేశానికి స్వాతంత్ర్యంవచ్చి 69ఏళ్లు దాటుతున్నా ఇంకా నిరుపేదలు అలాగేఉన్నారు.. ఇల్లిల్లు తిరుగుతూ బిక్షాటన చేసి జీవిస్తున్నవారి జీవితాలు అలాగే ఉన్నాయి.. సీపీఎం మహాజన పాదయాత్రలో సంచార జాతివారిని పాదయాత్ర బృందం సభ్యులు పరామర్శించారు.. ప్రభుత్వ పథకాలేవీ తమకు అందడంలేదని ఈ పేదలు పాదయాత్ర బృందానికి చెప్పుకున్నారు..తాము ఇక్కడకు వచ్చి దాదాపు 20సంవత్సరాలు దాటుతోందనీ..తమ పిల్లలకు ఇక్కడే పెండ్లిండ్లు అయ్యాయని ప్రభుత్వ సంక్షేమపథకాలు తమకు వర్తించేలా చేయాలని వారు కోరుతున్నారు. తమకు ఇండ్లు కట్టి ఇవ్వాలని వారు సీపీఎం పాదయాత్రకు వాళ్ళ గోడు వెళ్ళబోసుకున్నారు. పోసమ్మల కులాలకు చెందిన వారిని బీసీలుగా ప్రభుత్వం గుర్తించింది గానీ వారి అభివృద్ది కోసం ఎటువంటి చర్యలూ తీసుకోలేదని..ఎంబీసీ కులాలకు చెందిన వారిని కులాలను ఆదుకోవాలని ఎంబీసీ నేత ఆశయ్య డిమాండ్ చేశారు. సామాజిక సర్వే నిర్వహించి వారికి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

అధికారంలోకి వచ్చి రెండేళ్ళయినా టీఆర్ఎస్ హామీలు నెరవేర్చలేదు : తమ్మినేని
అధికారంలోకివచ్చి రెండున్నరేళ్లయినా టీఆర్‌ఎస్‌ ఇచ్చిన హామీలేవీ నెరవేర్చలేదని... సీపీఎ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు.. కాంట్రాక్ట్ కార్మికుల రెగ్యులరైజేషన్‌ ఏమైందని ప్రశ్నించారు.. సీపీఎం మహాజన పాదయాత్రలోభాగంగా తమ్మినేని బృందం కామారెడ్డి జిల్లాలో పర్యటిస్తోంది.. అక్కడి ప్రజల సమస్యలను తెలుసుకుంటోంది..

Don't Miss