వాజ్ పేయికి వాజ్ పేయి సాటి - బాబు...

09:19 - August 17, 2018

ఢిల్లీ : వాజ్ పేయికి వాజ్ పేయి సాటి అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అభివర్ణించారు. శుక్రవారం ఆయన ఢిల్లీకి చేరుకుని వాజ్ పేయి పార్థివ దేహానికి ఆయన నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అన్ని రిఫామ్స్ కు ఆద్యుడని, టెలీకమ్యూనికేషన్, నేషనల్ హైవే, మైక్రో ఇరిగేషన్, ఇన్ ఫ్రా స్ట్రక్చర్ ఇతరత్రా వాటిని ముందుకు తీసుకొచ్చారన్నారు. ఆయన చనిపోవడం దేశానికి పెద్ద లోటు అని, ఆయన అందరికీ ఆదర్శమన్నారు. ఒక ప్రధానిగా, ఒక ప్రతిపక్ష నేతగా, ఒక పార్లమెంటేరీయన్ గా వ్యవహరించారని తెలిపారు. తాను చేపట్టిన హైటెక్ సిటీని వాజ్ పాయి ప్రారంభించారని గుర్తు చేసుకున్నారు. ఒక కలుపుగోలుతనం..దేశ భవిష్యత్ కోసం ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు. నమ్ముకున్న సిద్ధాంతం ప్రకారం ఒక పద్ధతి ప్రకారం వెళ్లారన్నారు.

తాను ఢిల్లీకి వస్తుంటే నిధుల కోసమే వస్తున్నారని కొందరు అనుకొనే వారని పేర్కొన్నారు. మలేషియాలో కొన్ని రోడ్లు చూసి దేశంలో ఉన్న రోడ్ల విషయాన్ని వాజ్ పేయికి తెలియచేయడం జరిగిందని, చెన్నై - నెల్లూరు రోడ్ ను మలేషియా కంపెనీ వేసిందన్నారు. ఆయన ఉన్న సమయంలో గవర్నమెంట్ ని ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా పాలన కొనసాగించారని తెలిపారు. 1998లో బలపరీక్ష సమయంలో ఒక్క ఓటుతో ప్రభుత్వం పడిపోయిందన్నారు. 

Don't Miss