అనంత కల నెరవేరింది : చంద్రబాబు

16:08 - December 2, 2016

అనంతపురం : జిల్లా పెనుగొండ సమీపంలో నిర్మించిన గొల్లపల్లి రిజర్వాయర్‌ను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. గంగపూజ నిర్వహించి... జలాశయాన్ని ప్రారంభించారు. అనంతరం సర్వమత ప్రార్ధనలు నిర్వహించారు. దీంతో ఎన్నోఏళ్లుగా ఎదురుచూస్తున్న అనంత ప్రజల చిరకాల కోరిక నెరవేరినట్టు అయ్యింది. ఈ జలాశయం ద్వారా పెనుకొండ, హిందూపురం, మడకశిర నియోజకవర్గాల పరిధిలోని చెరువులకు నీరు లభించనుంది. భూగర్భ జలాలు పెరుగుతాయి. గ్రామాలకు తాగునీటి అవసరాలు తీరుతాయి. రిజర్వాయర్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు పరిటాల సునీత, కామినేని శ్రీనివాస్‌, దేవినేని ఉమామహేశ్వరరావు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణతోపాటు ఇతర నాయకులు పాల్గొన్నారు. 

Don't Miss