ఆ ఇద్దరి మధ్యవున్న సంబంధమేంటీ..?

12:08 - December 3, 2016

పర్హాన్ అక్తార్, శ్రద్దాకపూర్ మధ్య సమ్ థింగ్ సమ్ థింగ్ అంటూ బాలీవుడ్ లో హాట్ టాపిక్ నడుస్తుంది. ఈ జంట డేటింగ్ కోసం రెడీ అయినట్లు బీటౌన్ కోడైకూస్తుంది. ఈ బ్యూటీ కోసమే ఫర్హాన్ ఖరీదైన బంగ్లా తీసుకున్నాడట. ఇంతకీ వీరి సమ్ థింగ్ సమ్ థింగ్ మ్యాటరేంట్ చూడండి...
వీరి రిలేషన్ పై హాట్ హాట్ న్యూస్ 
ఇప్పుడు ఫర్హాన్ అక్తర్, శ్రద్దాకపూర్ లకు సంబంధించి రిలేషన్ పై బాలీవుడ్ లో హాట్ హాట్ న్యూస్ వినిపిస్తుంది. ఓ సినిమాలో కలిసి నటిస్తున్నపుడు హీరో, హీరోయిన్ల మధ్య ఏదో ఉందని పుకార్లు రావడం కామనే. కానీ ఆ తర్వాత కూడా ఇలాంటి వార్తలే హల్ చల్ చేస్తోందంటే మాత్రం కాస్త ఆలోచించాల్సిన విషయమే. రాక్ఆన్2లో కలిసి నటించిన శ్రద్ధాకపూర్, ఫరాన్ అక్తర్ లపై ఇప్పుడు అలాంటి వార్తలే షికార్లు చేస్తున్నాయి. 
ఫరాన్ తో శ్రద్ధా కపూర్  
ఫర్హాన్ నాకు బెస్ట్ ఫ్రెండ్ అని శ్రద్ధా కపూర్ చెబుతోంది కానీ వారి బిహేవియర్ మాత్రం అలా లేదని బాలీవుడ్ లో వినిపిస్తుంది. రాక్ఆన్2 కంటే ముందే వీరి బంధం మొదలైందని, బాఘీ సక్సెస్ అయినపుడు పార్టీ ఇచ్చిన శ్రద్ధా ఆ పార్టీలో ఫరాన్ అక్తర్ తో కలిసి శృతి మించి వేసిన చిందులను ఎవరూ మర్చిపోలేదని బీటౌన్ కామెంట్స్ . రీసెంట్ గా ముంబైలో జరిగిన సిటిజెన్ ఫెస్టివల్ లో కూడా  ఈ బ్యూటీ ఫరాన్ తో కలిసి కనిపించి మరింత క్లారిటి ఇచ్చినట్లు చేసింది.
ఫర్హాన్ అక్తార్, శ్రద్దాకపూర్ ల బంధం బలపడుతుందా..? 
ఫర్హాన్ అక్తార్, శ్రద్దాకపూర్ ల బంధం బలపడుతున్న విషయాన్ని ఈ జంట రోజు రోజుకు స్పష్టం చేస్తుంది. అంతేకాదు వీలు చిక్కినపుడల్లా ఈ బ్యూటీ ఫర్హాన్ ఇంటికి వెళ్లుతుందట.లేటేస్ట్ గా తన రిలేషన్ ని దాచడం ఎందుకని ఈ జోడి డిసిషన్ తీసుకుందట.అందుకే డేటింగ్ చేయడానికి ఫర్హాన్ బాంద్రాలో ఓ ఖరీదైన ఓ ఇల్లు కొనుక్కున్నాడట. త్వరలోనే ఈ ఇంట్లోకి శ్రద్దాకపూర్ రాబోతున్నట్లు హాట్ న్యూస్ వినిస్తుంది. కొంతకాలం సహజీవనం చేసిన తరువాత పెళ్లి చేసుకోవాలని వీరు నిర్ణయించుకున్నట్లు టాక్. ప్రస్తుతం ఫర్హాన్ అక్తర్ కు ఇద్దరు పిల్లలున్నారు. ఈ డైరెక్టర్ కమ్ హీరో 2000 సంవత్సరవంలో అధున అనే అమ్మాయి పెళ్లి చేసుకుని ఈ ఎడాది డైవర్స్ తీసుకున్నాడు. 

 

Don't Miss