దుర్గగుడిపై 'నోట్ల రద్దు'ఎఫెక్ట్..

14:14 - December 4, 2016

విజయవాడ : పెద్ద నోట్ల రద్దు అన్ని రంగాలపై ప్రభావం చూపుతోంది. చివరకు దుర్గగుడి కనకదుర్గమ్మకు కూడా తాకింది. పాతనోట్లు తీసుకోకపోవడం..రూ. 2వేల నోటుకు చిల్లర దొరక్కపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మ గుడికి పలు జిల్లాలు, రాష్ట్రాల నుండి భక్తులు వస్తుంటుంటారు. కుటుంబంతో ఇక్కడకు వచ్చిన భక్తులు పలు సమస్యలను ఎదుర్కొంటున్నారు. సేవా టికెట్ల కొనుగోలుకు పాతనోట్లను నిరాకరిస్తున్నారని భక్తులు వాపోయారు. కొండపై చిల్లర దొరక్కపోవడంతో భక్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ ఏటీఎంలు చూసినా రెండు వేల నోట్లు రావడంతో చిల్లరదొరక్క పోవడంతో పలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆలయ అధికారులు స్వైపింగ్ మిషన్లను ఏర్పాటు చేశారు. కానీ దుర్గగుడికి వచ్చే భక్తులు ఏటీఎం కార్డులు తేలేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై అధికారులు స్పందిస్తారా ? లేదా ? అనేది చూడాలి.

Don't Miss