సండే..గవే కష్టాలు..

21:20 - December 4, 2016

హైదరాబాద్ : 26 రోజులు పూరైనా కరెన్సీ కష్టాలు తీరడం లేదు. కొద్దిరోజులుపోతే ఈ సమస్య ఉండదనుకున్న సామాన్యులకు నిరాశే మిగులుతోంది.. నగదుకోసం జనాలు గంటలకొద్దీ క్యూ కడుతూనే ఉన్నారు.. ఆదివారం కావడంతో ఆ కాస్త డబ్బుకూడా దొరక్క సమస్యలు రెట్టింపయ్యాయి. అసలే కొత్త నోట్లు దొరక్క అష్టకష్టాలు పడుతున్న సామాన్యులకు ఆదివారం మరిన్ని సమస్యలు తెచ్చిపెట్టింది.. వర్కింగ్‌డేస్‌లోనే అంతంతమాత్రంగా దొరుకుతున్న నగదుకు సండే బ్రేక్‌ వేసింది.. పనిచేస్తున్న ఆ 20శాతం ఏటీఎంలలో కూడా డబ్బు కరువైంది.. అవుట్‌ ఆఫ్ సర్వీస్‌ బోర్డులు ఏటీఎంల ముందు వేలాడుతూ దర్శనమిచ్చాయి. నోట్ల రద్దుకుముందు ఎప్పుడు సందడిగా ఉండే మార్కెట్లు ఇప్పుడు జనాలు లేక వెలవెలబోతున్నాయి... ఆదివారం అయినా ఎక్కడా హడావుడి కనిపించలేదు.. క్యాష్‌లేక హైదరాబాద్‌ రామ్‌నగర్‌ ఫిష్ మార్కెట్‌లో 90శాతం అమ్మకాలు పడిపోయాయి.. చిల్లర సమస్యతో కూడా చేపల్ని సామాన్యులు కొనలేకపోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని చాలా నగరాల్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. ఇక బెజవాడ దుర్గ గుడిలో చిల్లర సమస్య మరింత వేధిస్తోంది.. సేవా టికెట్లకు పాతనోట్లు చెల్లక భక్తులకు ఇబ్బందుల తప్పలేదు. మొత్తానికి రోజులు గడిస్తే నగదు సమస్య తీరుతుందనుకున్న సామాన్యులకు నిరాశే ఎదురవుతోంది.. రోజురోజుకూ కష్టాలు పెరగడంతో ఏం చేయాలో తెలియక జనాలు అవస్థలు అనుభవిస్తున్నారు.

Don't Miss