నోట్ల రద్దు..గుంటూరులో బాధలు చూడండి..

10:17 - December 2, 2016

గుంటూరు : పెద్దనోట్లు రద్దు చేసి 23 రోజులు పూర్తయ్యాయి. 24వ రోజు కూడా అదే పరిస్థితులు నెలకొన్నాయి. గుంటూరు జిల్లాలో దారుణమైన పరిస్థితి నెలకొంది. నోట్ల రద్దు పేద..సామాన్యుడు..మధ్యతరగతి వారిని తీవ్ర ఇక్కట్లకు గురి చేస్తోంది. గత 23 రోజులుగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని ప్రజలు పేర్కొంటున్నారు. 24వ రోజు జిల్లాలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో తెలుసుకొనేందుకు టెన్ టివి ప్రయత్నించింది. తెల్లవారుజామున నుండి ఏటీఎంల ఎదుట పడిగాపులు పడుతున్నామని, డబ్బులు లేక పంటలు ఎండిపోతున్నాయని ఓ రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తనకు ఆపరేషన్ జరిగిందని డబ్బుల కోసం పది రోజుల నుండి తిరుగుతున్నానని ఓ టీచర్ ఆవేదన వ్యక్తం చేశారు. మరికొంత మంది తమ బాధను టెన్ టివికి తెలిపారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

Don't Miss