'బాహుబలి-2..ట్రైలర్ కౌంట్ డౌన్..

15:54 - March 15, 2017

తెలుగు సినిమా సత్తా ఏంటో ప్రపంచానికి చాటి చెప్పిన సినిమా 'బాహుబలి'. ఈ చిత్రాన్ని తెరకెకిక్కించిన 'రాజమౌళి' ఒక్క ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పడం లేదు. 'కట్టప్ప' బాహుబలిని ఎందుకు చంపాడా ? అని అందరీలోనూ మెదలుతున్న ప్రశ్న. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ట్రైలర్ కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. సినిమా ట్రైలర్ ను 16వ తేదీన విడుదల చేస్తామని స్వయంగా 'రాజమౌళి' చెప్పడంతో అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఉదయం తెలుగు రాష్ట్రాలు..ఇతర ప్రాంతాల్లో ఎంపిక చేసిన థియేటర్ లలో చిత్ర ట్రైలర్ ను విడుదల చేయనున్నామని, సాయంత్రం 5 గంటలకు సోషల్ మాధ్యమాల్లో విడుదల చేస్తామని రాజమౌళి ప్రకటించారు. ఇప్పటికే తొలి భాగంతో ఇండస్ట్రీ రికార్డ్లను 'బాహుబలి' తిరగారాసిన సంగతి తెలిసిందే. మరోసారి రికార్డులు సృష్టించాలని 'బాహుబలి 2' చిత్ర యూనిట్ భావిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. మరి చిత్ర ట్రైలర్ ఎలా ఉంటుందో ? ఎలాంటి రికార్డులు సృష్టించనుందో కొద్ది గంటల్లో తేలనుంది.

Don't Miss