దేవగౌడపై ప్రతీకారం కోసమే గవర్నర్ యడ్యూరప్పకి పట్టం?!!..

14:37 - May 17, 2018

ప్రపంచంలోనే భారతదేశానికి ప్రజాస్వామ్యం దేశమని పేరు. లౌకిక రాజ్యమని ఘనత. ఆ ఘనతను, గొప్పతనాన్ని మనం నిలుపుకుంటున్నామా? వ్యక్తిగతంలో జరిగిన అవమానాలను రాజ్యాంగాన్ని అడ్డంపెట్టుకుని ప్రతీకారాలు తీసుకునే దుస్థితికి, దుర్భలత్వానికి, నిసిగ్గుకు, అనైతికతకు భారతదేశపు ప్రజాస్వామ్యం దిగజారిపోయిందా? పదవిని, అధికారాన్ని అడ్డం పెట్టుకుని రాజ్యాంగానికి,ప్రజాస్వామ్యానికి అవమానం చేస్తున్నామా? అనే ఇంగితం కూడా మరిచిపోయి వ్యక్తిగత ప్రయోజనాల కోసం, వ్యక్తిగత పగలు తీర్చుకునేందుకు ప్రజాభిప్రాయాన్ని, రాజ్యాం విలువలను, రాజ్యాంగ నిబంధలను తుంగలో తొక్కుతున్న నేతలను ఏం చేయాలి? వారిని ప్రజలు బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుందా? అసలు గవర్నర్ అంటే ఏమిటి? వారికుండే అధాకారాలేమిటి? గవర్నర్ విధులేమిటి?

గవర్నర్ అంటే?..
రాష్ట్ర రాజకీయాల్లో గవర్నర్ పాత్ర అతిప్రధానమైనది. రాష్ర్టాధినేతగా గవర్నర్ నిర్వహించే విధులు, అధికారాలు అత్యంత విశేషమైనవి. అందువల్ల గవర్నర్ అధికారాలపై, రాజ్యాంగపరంగా గవర్నర్ స్థానంపై ఒక ప్రత్యేకమైన గౌరవభావం వుంటుంది. రాష్ట్రంలో జరిగే పరిస్థితులను సమీక్షిస్తు..రాష్ట్రానికి, కేంద్ర ప్రభుత్వానికి అనుసంధానంగా గవర్నర్ వ్యవహరిస్తారు.

వివాదాస్పదంగా గవర్నర్ పదవి..అధికారాలు..
ఇటీవలి కాలంలో అత్యంత వివాదాస్పదమైన అంశాల్లో అతిముఖ్యమైనవి గవర్నర్ అధికారాలు. అందులోనూ గవర్నర్ విచక్షణాధికారాల గురించి మరింత లోతుగా చర్చ జరిగింది. తమిళనాడులో జయలలిత మరణం తర్వాత కొత్త ముఖ్యమంత్రిని నియమించేటప్పుడు ఎవరిని నియమించాలో గవర్నర్ నిర్ణయించాలి. ఆ తరువాత జల్లికట్టు ఉద్యమ సమయంలో కేంద్రానికి, రాష్ర్టానికి మధ్య అనుసంధానకర్తగా గవర్నర్ వ్యవహరించాడు. శశికళ, పన్నీర్ సెల్వానికి మధ్య జరిగిన అధికార కుమ్ములాటలో, చివరికి పళనిస్వామి ముఖ్యమంత్రి పీఠం ఎక్కినంతవరకు గవర్నర్ పోషించిన పాత్రపై ఎన్నో విమర్శలూ, ఎన్నో వివాదాంశాలూ ఉన్నాయి. ఆ తరువాత పోషించిన పాత్రపై ఎన్నో విమర్శలు, వివాదాంశాలు ఉన్నాయి. అనంతరం పళనిస్వామి ఎంపిక రాజ్యాంగబద్ధంగా లేదని ప్రధానప్రతిపక్షం డీఎంకే గవర్నర్‌కి ఫిర్యాదు చేయడం, ఆ ఎంపికపై గవర్నర్ కేంద్రానికి ఒక నివేదిక పంపడం ఎంతో ఉత్కంఠను సైతం రేకెత్తించాయి.

అరుణాచల్‌ప్రదేశ్‌లో ..
అరుణాచల్‌ప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలనపై సుప్రీంకోర్టు అక్షింతలు వేయడం, గవర్నర్ అధికారాలపై తీవ్ర చర్చ జరిగింది. ఎన్‌డీఏ ప్రభుత్వం రాగానే ఉన్న గవర్నర్లను రాజీనామా చేయమనడం, వారి ఎంపిక, తొలగింపు పై తీవ్రమైన చర్చ కూడా కొనసాగుతోంది.

గవర్నర్ అంటే..
ఒక రాష్ట్ర రాజ్యాంగాధినేత, రాజ్యాంగ పరంగా ఆ రాష్ట్ర పెద్ద ఇతనే. రాష్ర్టానికి మొదటి పౌరుడు. కేంద్రంలో రాష్ట్రపతిలా రాష్ట్రంలో రాజ్యాంగరీత్యా గవర్నర్ కార్యనిర్వాహణ అధిపతి. ప్రకరణ 153 ప్రకారం ప్రతి రాష్ర్టానికి ఒక గవర్నర్ ఉంటారు.

గవర్నర్ అధికారాలు..
ప్రతీ రాష్ట్రానికి వుండే ముఖ్యమంత్రి ప్రభుత్వాధినేత కాగా, గవర్నరు రాష్ట్రాధినేతగా వ్యవహరిస్తారు. గవర్నరు పదవి నామకార్థమైనది. భారత రాష్ట్రపతికి రాష్ట్రంలో ప్రతినిధిగా గవర్నరు వ్యవహరిస్తారు. 5 సంవత్సరాల పదవీకాలానికి గాను గవర్నరును రాష్ట్రపతి నియమిస్తారు. అలాగే పరిపాలన, నియామకాలు, తొలగింపులు,రాష్ట్ర శాసనసభ, శాసనమండలికి సంబంధించిన అధికారాలు వుంటాయి. విచక్షణను ఉపయోగించగల అధికారాలు గవర్నర్ కు వుంటాయి. అంతేకాదు భారతదేశపు రాష్ట్రపతికి ప్రతినిథిగా ప్రతీరాష్ట్రంలోను గవర్నర్ వుంటారు. కాని అంతిటి ఉన్నతస్థానం వివాదాలకు కేంద్రంగా మారుతోంది. వ్యక్తిగత ఇష్టాలను, భావాజాలాలను, స్వపార్టీల పక్షపాత వైఖరిగా మారుతోంది.

వ్యక్తిగత పగ తీర్చుకునేందుకే బీజేపీకి గవర్నర్ పట్టం?..
గవర్నర్ పదవిలకే కళంగా తెచ్చేలా వ్యవహరిస్తున్న కొందరు తీరు వుంటోంది. ఇప్పటకే పలు సందర్భాలలో అటువంటి సందర్భాలు జరిగాయి. ఇప్పుడు తాజాగా కర్ణాటకలో జేడీఎస్, కాంగ్రెస్ కూటములను కాదని బీజేపీ పార్టీకు గవర్నర్ వాజూభాయ్ వాలా పట్టం కట్టారు.

22 సంవత్సరాల క్రితం జరిగిన అవమానానికి ప్రతీకారం..
దాదాపు 22 సంవత్సరాల క్రితం దేవెగౌడ ప్రధాన మంత్రిగా ఉన్న సమయంలో తనకు, తన పార్టీకి జరిగిన అన్యాయానికి ప్రస్తుత కర్ణాటక గవర్నర్ గా ఉన్న వాజూభాయ్ ప్రతీకారం తీర్చుకున్నారు. నాడు తనకు మంత్రి పదవిని దూరం చేసే నిర్ణయం తీసుకున్న దేవెగౌడ కుమారుడికి, ఇప్పుడు సీఎం పీఠం దక్కకుండా చేశారు. 22 ఏళ్ల క్రితం ఏం జరిగిందో ఓసారి తలచుకుందాం. 1996లో దేవెగౌడ ప్రధానిగా ఉన్న సమయంలో గుజరాత్ లో సురేశ్ మెహతా నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం పడిపోయింది.

వాజూభాయ్ ని పదవీత్యుడిని చేసిన దేవగౌడ..
అప్పటికి మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా విజయం సాధించిన ప్రస్తుత కర్ణాటక గవర్నర్ గా వున్న వాజూభాయ్ కి, మెహతా ప్రభుత్వంలో తొలిసారిగా మంత్రి పదవి దక్కింది. ఇక ఆ సమయంలో బీజేపీ నుంచి 40 మంది ఎమ్మెల్యేలను విడగొట్టిన శంకర్ సింగ్ వాఘేలా, కాంగ్రెస్ సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమయంలో గుజరాత్ లో రాష్ట్రపతి పాలన పెట్టాలని రాష్ట్రపతి శంకర్ దయాల్ శర్మకు సిఫార్సు చేసిన దేవెగౌడ, వాజూభాయ్ పదవిని మూన్నాళ్ల ముచ్చటగా మార్చారు.

దేవగౌడపై ప్రతీకారం తీర్చుకున్న గవర్నర్..
అప్పటి గవర్నర్ సైతం మెజారిటీ సీట్లున్న బీజేపీకి బదులు వాఘేలా స్థాపించిన పార్టీ ఆర్జేడీ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. ఆ ప్రభుత్వం 1998 వరకూ కొనసాగగా, ఆ తరువాతి కాలంలో వాజూభాయ్ ఎమ్మెల్యేగా గెలిచినా, మంత్రి పదవి దక్కలేదు. నాలుగేళ్ల క్రితం బీజేపీ కేంద్రంలోకి అధికారంలోకి వచ్చిన తరువాత వాజూభాయ్ ని కర్ణాటక గవర్నర్ గా నియమించగా, నాడు దేవెగౌడ చేసిన పనికి, నేడు ప్రతీకారం తీర్చుకున్నారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Don't Miss