'బిగ్ బాస్'2 తో దూసుకొస్తున్న నాచ్యురల్ స్టార్..

11:46 - June 4, 2018

తెలుగులో 'బిగ్ బాస్' సాధించిన విజయంతో మరో బిగ్ బాస్ ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. ఈ ముహూర్తం కూడా ఆసన్నమైంది. మొదటి బిగ్ బాస్ కు ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా అదరగొట్టాడు..కామెడీ, సమయస్ఫూర్తి..వీటి తోటు ఎన్టీఆర్ వాక్చాతుర్యం వెరసి 'బిగ్ బాస్ ' సూపర్ హిట్ అయ్యింది.ఈ నేపథ్యంలో 'బిగ్ బాస్ '2 లో మరింత జోష్ తో..మరింత హాట్ హాట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. అసలే జోష్ కు మారుపేరుగా వుండే నాని ఈ షోలో మరింత జోష్ పుట్టించనున్నాడు. ఇప్పటికే ప్రోమోలతో ఉత్సాహాన్ని రేకెత్తిస్తున్న ఈ నాచ్యురల్ స్టార్ యాంకరింగ్ కోసం..ఈ షోలో పాల్గొనే సెలబ్రిటిలు ఎవరా? అనే ఉత్కంఠతతో ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.

ముహూర్తం దగ్గరపడుతున్న 'బిగ్‌బాస్' సీజన్ 2..
తెలుగు 'బిగ్‌బాస్' సీజన్ 2 ప్రసారానికి ముహూర్తం దగ్గరపడుతోంది. ఈ షోకు వ్యాఖ్యాతగా నేచురల్ స్టార్ నాని ఈల వేస్తూ సీజన్‌-2కు వచ్చేస్తున్నాడు. 'జూన్ 10.. 100 రోజులు.. 16 మంది సెలబ్రిటీలు.. 1 బిగ్ హౌస్.. బిగ్ బాస్ 2'తో నాచురల్ స్టార్ రాబోతున్నాడు. 'ఏదైనా జరగొచ్చు' రెడీగా ఉండడంటూ నాని తన అభిమానుల్లో, ఔత్సాహికుల్లో మరింత ఆసక్తి పెంచుతున్నాడు. ఈ షో స్టార్ మాలో సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 9.30 గంటలకు, శని, ఆది వారాల్లో రాత్రి 9 గంటలకు ప్రసారం కానుంది. ఇప్పటికే పలు షోలలో అలరించిన నాని ఈ బిగ్ బాస్ 2లో ఏవిధంగా ప్రేక్షకులను, పాల్గొన్నవారిని ఎలా ఆకట్టుకోనున్నాడో చూడాలి..

Don't Miss