'బిగ్ ఫ్రైడే'..'నో కాన్ఫిడెన్స్' ఆన్ బిగ్ డిబేట్..

09:39 - July 20, 2018

ఢిల్లీ : హస్తినలో అవిశ్వాసపు వేడి రాజుకుంది. అధికార, విపక్షాల మధ్య అవిశాస్వపు సెగ రాజుకుంది. రాష్ట్రానికి కేంద్రం ప్రభుత్వం విభజన హామీలను నెరవేర్చకుంట కక్ష సాధింపు ధోరణిని అవలంభిస్తోందనే కారణంతో కేంద్ర ప్రభుత్వపు తీరును ఎండగట్టేందుకు పార్లమెంట్ ను వేదికగా చేసుకుని ఏపీకి జరిగిన..జరుగుతున్న అన్యాయాన్ని కూలకషంగా తెలిపేందుకు టీడీపీ అన్ని అస్త్ర శస్త్రాలు సిద్ధం చేసుకుంది. దీని కోసం ఎప్పటినుండి వేచి చూస్తున్న సీఎం చంద్రబాబు అన్ని విధాలుగాను రంగం సిద్ధం చేసుకున్నారు. కాగా ఏపీకి ఇచ్చిన అన్ని వాగ్ధానాలను నెరవేర్చేశామని అడ్డగోలుగా వాదిస్తు ఏపీపై ఎదురు దాడికి సిద్ధమయిన బీజేపీ ప్రభుత్వం ముఖ్యంగా టీడీపీని టార్గెట్ గా అవిశ్వాస తీర్మానంపై చర్చకు సిద్ధమయ్యింది. ఈ క్రమంలో పార్లమెంట్ లో జరగనున్న అవిశ్వాసపు తీర్మానంపై చర్చ, ఓటింగ్ విషయంలో జరనున్న ఉత్కంఠభరితమైన సందర్భాన్ని చూసేందుకు దేశం మొత్తం ఆసక్తిగా,ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. ఈ అంశంపై 10టీవీ బిగ్ డిబేట్ ను చేపట్టింది. ఈ బిగ్ డిబేజ్ లో 10టీవీ ఇన్ పుట్ ఎడిటర్ కృష్ణ సాయిరామ్, ప్రముఖ విశ్లేషకులు తెలకపల్లి రవి, టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి, కాంగ్రెస్ నేత తులసిరెడ్డి, బీజేపీ నేత లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. 

Don't Miss