ఎన్‌ఆర్‌సి జాబితాలో 40 లక్షల మంది పౌరుల పేర్లు లేకపోవడంపై విమర్శలు

16:18 - July 30, 2018

అసోం : అసోంలో భారత పౌరులకు సంబంధించిన లిస్టును నేషనల్‌ రిజిస్టర్‌ ఆఫ్‌ సిటిజెన్స్‌ విడుదల చేసింది. ఈ రిజిస్టర్‌ ముసాయిదాలో 40 లక్షల మందికి పౌరసత్వం లభించకుండా పోయింది. మొత్తం 3.29 కోట్ల మందికి గాను 2.89 కోట్ల మందిని ఈ ముసాయిదాలో చేర్చారు. ఇది కేవలం డ్రాఫ్ట్‌ మాత్రమేనని తుది జాబితా కాదని అధికారులు స్పష్టం చేశారు. ముసాయిదాలో లేనివారిని విదేశీయులుగా పరిగణించబోమని జాతీయ పౌర రిజిస్టర్ హామీ ఇచ్చింది. ముసాయిదాలో తమ పేర్లు ఎందుకు నమోదు కాలేదో తెలుసుకునేందుకు ఆగస్టు 7 నుంచి స్థానిక రిజిస్ట్రార్‌ వద్దకు వెళ్లి సంప్రదించాలని అధికారులు తెలిపారు. ఎన్‌ఆర్‌సి జాబితాలో 40 లక్షల మంది పౌరుల పేర్లు లేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Don't Miss