సత్తా చాటిన 'రన్నర్లు'...

06:51 - August 29, 2018

ఢిల్లీ : ఆసియా క్రీడల్లో భారత రన్నర్లు సత్తా చాటారు. 800 మీటర్ల పరుగు పందెంలో మంజీత్‌ సింగ్‌ స్వర్ణం సాధించాడు. మరో స్ర్పింటర్‌ జిన్సన్‌ జాన్సన్‌ రెండో స్థానంలో నిలిచి రజతం దక్కించుకున్నాడు. దీంతో బ్యాడ్మింటన్‌ తర్వాత ఒక పోటీలో భారత్‌కు రెండు పతకాలు వచ్చినట్టైంది. రేసుకు ముందు జాన్సన్‌ ఫేవరెట్‌. అతడిని దాటేసి మంజీత్‌ 1 నిమిషం 46.16 సెకన్లలో పరుగును పూర్తి చేశాడు. అతడి వ్యక్తిగత అత్యుత్తమ టైమింగ్‌ కూడా ఇదే.

 

Don't Miss