సన్యాసులను రక్షించిన జవాన్లు...

06:31 - July 7, 2018

ఢిల్లీ : అస్సాంలో ఆర్మీ జవాన్లు స్థానిక ప్రజల మూకుమ్మడి దాడి నుంచి ముగ్గురు సాధువులను కాపాడారు. మాహుర్‌ పట్టణంలో పిల్లలను ఎత్తుకెళ్లడానికి సన్యాసుల వేషంలో వచ్చారని స్థానికులు వారిని చుట్టుముట్టారు. మాహూర్‌లోకి అడుగుపెట్టగానే గ్రామస్తులు వారి కారును ఆపి వాదానికి దిగారు. ఆర్మీ జవాన్లు నిముషాల్లో అక్కడికి చేరుకోవడంలో పెను ముప్పు తప్పింది. ముగ్గురు సన్యాసులను సురక్షితంగా ప్రజల చెర నుంచి తప్పించ గలిగారు. 26 నుంచి 31 ఏళ్ల లోపు ఉన్న ముగ్గురు సన్యాసులు ఉత్తరప్రదేశ్‌కు చెందినవారని పోలీసులు తెలిపారు. అస్సాం జరగనున్న ఓ మేళాలో పాల్గొనడానికి ఇక్కడికి వచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. వాట్సప్‌లో పిల్లల్ని ఎత్తుకెళ్తున్నారన్న రూమర్లు షికార్లు చేయడంతో గ్రామస్థులు మూకుమ్మడి దాడులకు దిగుతున్నట్లు పోలీసులు తెలిపారు. గత నెల కర్బి ప్రాంతంలో చైల్డ్‌ లిఫ్టర్స్‌గా భావించి స్థానికులు ఇద్దర్ని కొట్టి చంపిన విషయం తెలిసిందే.

Don't Miss