వంట చేస్తున్నారా..ఒక్క నిమిషం...

13:43 - June 19, 2017

మీరు వంట చేస్తున్నారా ? ఒక్క నిమిషం ఆగండి..వంటలో వాడుతున్న పదార్థాలు బాగానే ఉంటున్నాయా ? అవి ఆరోగ్యానికి మేలు చేస్తున్నాయా ? లేక హానీ చేస్తున్నాయా ? అని ఆలోచించారా ? వాటిలోని పోషక విలువలు గుర్తించారా ? ఆ..ఇవన్నీ ఎక్కడ ఆలోచిస్తాం..వంట చేశామా...తిన్నామా అనే ఆలోచనలో ఉంటున్నారు..కానీ ఒక్కసారి వంటలో వాడుతున్న పదార్థాలు..వాటిలోని పోషక విలువలు ఆలోచించాలని పలువురు వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
ప్రతి రోజు తినే ఆహారంలో ఆకుకూరలు..తాజా పళ్లు..రసాలు..పెరుగు..గుడ్డు..పాలు వంటివి ఉండేలా చూసుకోండి.
పెరుగును తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెంచుతుంది. ఇందులో మంచి చేసే బ్యాక్టీరియా ఉంటుంది.
వంట చేసే సమయంలో ఉపయోగించే నూనె ఆలివ్ ఆయిల్..ఆవనూనెలను వాడి చూడండి..
టీ..కాఫీలు..ఐస్ క్రీమ్..స్వీట్స్ వంటి అధికంగా తీసుకోకండి. మితిమీరిన తీపి పదార్థాలు తినకండి.
తీపి తినడం వల్ల ఊబకాయం..చక్కెర..కీళ్ల నొప్పులు వంటి అనారోగ్యాల బారిన పడాల్సి వస్తుంది.
ఎక్కువ ప్రొటీన్స్‌ గల పదార్థాలు తీసుకుంటే దీర్ఘకాలంలో సైడ్‌ఎఫెక్ట్స్‌కి దారితీయొచ్చు.
వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియా, యాంటీ వైరల్ గుణాలు ఉంటాయి. గాయాలకు, చర్మ వ్యాధులకు, ఫ్లూ, అల్సర్, రక్తపోటు, పెద్దపేగు క్యాన్సర్, జలుబు, మూత్రపిండాల వ్యాధులకు, బ్లాడర్ సమస్యలకు వెల్లుల్లి చక్కటి ఔషధంగా పనిచేస్తుంది.
గోధుమల్లో పిండి పదార్థాలతో పాటు ప్రోటీన్లు, పీచు, ఐరన్, విటమిన్లు, బీ కాంప్లెక్స్, మెగ్నీషియం, ఫాస్పరస్, జింక్ వంటి పోషకాలు ఉన్నాయి. ఇందులో పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి.

Don't Miss