విద్యుత్ మిగులు రాష్ట్రంగా ఎపి అవతరిస్తొందా ?

08:05 - December 1, 2016

విజయవాడ : విద్యుత్ మిగులు రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతరిస్తొందా ? సరఫరా నష్టాలను అధిగమించడంలో చంద్రబాబు సర్కార్ సక్సెస్ అయిందా అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇంతకీ విద్యుత్ పంపిని సంస్ధల లెక్కలు ఏం చెప్తున్నాయి. విద్యుత్‌ పంపిణీలో ఏపీ మిగులు రాష్ట్రంగా అవతరిస్తుందా లేదా ? వాచ్ దిస్ స్టోరీ..
దూసుకుపోతున్న రాష్ట్రం 
రాష్ట్ర విభజనానంతరం..విద్యుత్ కోతలులేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆవిర్భవించింది. కేంద్రప్రభుత్వ సహకారంతో 24గంటల నిరంతర విద్యుత్ సరఫరా పథకం కింద ఎంపికై..వ్యవసాయ, గృహ, వాణిజ్య అవసరాలకు నిరంతరం విద్యుత్ వెలుగులను అందిస్తొంది. అయితే విద్యుత్ ట్రాన్మిషన్ నష్టాలను అధిగమించడంతో మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చని భావించిన చంద్రబాబు..ఆ మేరకు అధికారులకు దిశానిర్దేశ్యం చేశారు. అధునాతన సాకేతిక పరిజ్ఞానాన్ని వాడుకొని పంపిణీ నష్టాలను అధిగమించారు. ఫలితంగా విద్యుత్ మిగులు సాధించడంలో రాష్ట్రం దూసుకుపోతుంది. 
విద్యుత్ నియంత్రణ కమిషన్‌కు ఖర్చు నివేదిక 
2017...18 నాటికి వార్షికాదాయ ఖర్చు నివేదికను డిస్కంలు విద్యుత్ నియంత్రణ కమిషన్‌కు సమర్పించాయి. రాష్ట్రంలోని విద్యుత్ సంస్థలకు వచ్చే ఏడాదికి 30వేల 69 కోట్ల రూపాయల అవసరం ఉంటుందని అంచనా వేసిన అధికారులు,..ఆదాయం మాత్రం 22 వేల 892 కోట్ల  రూపాయలే ఉంటుందని తెలిపారు. సుమారు 7,177 కోట్ల మేర లోటు ఉండొచ్చని డిస్కం అధికారులు స్పష్టం చేశారు. అటు అన్ని వనరుల నుంచి రాష్ట్రంలో 67వేల 948 మిలియన్ యూనిట్ల విద్యుత్ అందుబాటులో ఉంటుందని వెల్లడించిన విద్యుత్ సంస్థలు,..వినియోగం మాత్రం 57 వేల 18 మిలియన్‌ యూనిట్లు ఉండొచ్చని తెలిపారు. అయితే గతంలో ఎన్నాడూ లేని విధంగా రికార్డు స్థాయిలో వచ్చే ఏడాదిలో 10 వేల 930 మిలియన్ యూనిట్ల మిగులు విద్యుత్ ఏర్పడుతుందని డిస్కాంలు అంచనా వేస్తున్నాయి. మొత్తానికి మిగులు విద్యుత్ సాధించడంపై ఏపీ ప్రభుత్వం సంతోషం వ్యక్తం చేస్తుంది. కొత్త రాష్ట్రంలో నూతన పారిశ్రామిక అవసరాలకోసం ఈ విద్యుత్‌ను ఉపయోగించుకుంటామనీ ఆనందం వ్యక్తం చేస్తొంది.

 

Don't Miss