దాసరికి అవార్డు అంకితం - అల్లు అర్జున్..

13:19 - June 19, 2017

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ 'అల్లు అర్జున్' 64వ ఫిల్మ్ ఫేర్ అవార్డును అందుకున్నారు. ‘సరైనోడు' చిత్రానికి గాను ఈ అవార్డు ఆయనను వరించింది. ఈ సందర్భంగా అవార్డును ప్రముఖ దివంగత దర్శకుడు 'దాసరి నారాయణ రావు'కు అంకితం ఇస్తున్నట్లు ప్రకటించాడు. 64వ ఫిల్మ్ ఫేర్ అవార్డు ప్రధానోత్సవం ఇంటర్నేషనల్ కన్వన్షన్ సెంటర్ లో జరిగింది. పలువురు తారలు విచ్చేయడంతో సందడిగా మారిపోయింది. ఈ సందర్భంగా 'అల్లు అర్జున్' ట్విటర్‌ ద్వారా ఫిల్మ్‌ఫేర్‌కు ధన్యవాదాలు చెప్పారు. ఈ అవార్డును దర్శకరత్న దాసరి నారాయణ రావుకు అంకితం చేస్తున్నట్లు ట్వీట్‌ చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో దిగిన ఫొటోను పోస్ట్‌ చేశారు. ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్‌ చేతుల మీదుగా అవార్డును 'అల్లు అర్జున్' అందుకున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ‘అల్లు అర్జున్’ హరీశ్ శంకర్ కాంబినేషన్ లో ‘దువ్వాడ జగన్నాథమ్’ చిత్రం రూపుదిద్దుకొంటోంది. ఇందులో 'బన్నీ' సరసన పూజా హెగ్దే హీరోయిన్ గా నటిస్తోంది. జూన్‌ 23న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

Don't Miss