'ధృవ' కోసం అరవింద్ ఏం చేశారు..

13:49 - December 8, 2016

మెగా కుటుంబం నుండి వచ్చిన హీరోల్లో ఒకరు 'రామ్ చరణ్ తేజ'..ఇతను నటించిన సినిమాలు కొన్ని విజయవంతం కాగా మరికొన్ని డిజాస్టర్ గా మిగిలాయి. 'బ్రూస్ లీ' సినిమా అంతగా ఆడకపోయేసరికి 'చెర్రీ' ఆచితూచి అడుగులేస్తున్నాడు. తాజాగా 'ధృవ' సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. తమిళంలో ఘన విజయం సాధించిన 'తని ఒరువన్' చిత్రాన్ని 'ధృవ' పేరుతో రీమెక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో 'రామ్ చరణ్' పవర్ ఫుల్ పోలీసు ఆఫీసర్ పాత్రలో మెరిపించనున్నాడు. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో 'అల్లు అరవింద్‌' ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తెలుగులో డిసెంబర్ 9వ తేదీన విడుదలవుతోంది. అంతేగాక ఇతర ప్రాంతాల్లో కూడా ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. కానీ సినిమా విడుదల సమయంలో పలు సమస్యలు తలెత్తాయి. ఈ సమస్యలను 'అల్లు అరవింద్' తనదైన శైలిలో పరిష్కరించాని టాక్. 'ధృవ' సినిమా కోసం 'సూర్య' 'సింగం' సినిమాను వెనక్కి పంపే విధంగా పావులు కదిపినట్లు తెలుస్తోంది. చెన్నయ్ బోర్డర్ లో కూడా తలెత్తిన సమస్యను చాకచక్యంగా పరిష్కరించాని వార్తలు వస్తున్నాయి. 'ధృవ' సినిమా రిలీజ్ రోజునే అక్కడ 'సుందరంగ జాణ' సినిమా విడుదలవుతోంది. తెలుగులో వచ్చిన 'భలే భలే మగాడివోయ్' కు కన్నడ రీమెక్. ఇందులో కాస్త ఫాలోయింగ్ ఉన్న 'గణేష్' హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్ర నిర్మాణంలో 'అల్లు అరవింద్' భాగస్వామి అని తెలుస్తోంది. మరో భాగస్వామి రాక్ లైన్ వెంకటేష్ అని టాక్. 'ధృవ' రిలీజ్ వల్ల 'సుందరంగ జాణ' 23 రిలీజ్ కాబోతోంది...

Don't Miss