అలహాబాద్‌ కోర్టు కీలక తీర్పు

17:48 - December 8, 2016

అలహాబాద్‌ : ఇస్లాం మతంలోని ట్రిపుల్‌ తలాక్‌ విషయంలో అలహాబాద్‌ కోర్టు ఈ రోజు కీలక తీర్పు వెలువరించింది. మూడు సార్లు తలాక్‌ అన్న పదం ఉచ్చరించి విడాకులు ఇచ్చే అంశం రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టు స్పష్టంచేసింది. ఈ సంప్రదాయాన్ని ప్రోత్సహించడమంటే ముస్లిం మహిళల హక్కులను హరించడమేనని హైకోర్టు అభిప్రాయపడింది. రాజ్యాంగానికంటే పర్సనల్‌ లా గొప్పేమీ కాదని స్పష్టంచేసింది. ఇటీవల ఈ ట్రిపుల్‌ తలాక్‌ అంశంపై పెద్దఎత్తున చర్చ నడిచిన సంగతి తెలిసిందే. ఇది రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ కొందరు మహిళలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనికి కేంద్రం సైతం మద్దతు తెలిపింది. ఇది స్త్రీపురుష సమానత్వానికి వ్యతిరేకమని పేర్కొంది. కాగా, ముస్లిం మత పెద్దలు మాత్రం దీన్ని సమర్థిస్తున్నారు.

 

Don't Miss