అజిత్ వాడేకర్ కన్నుమూత...

09:05 - August 16, 2018

ఢిల్లీ : భారత మాజీ టెస్ట్‌ కెప్టెన్‌ , చీఫ్‌ సెలెక్టర్‌ అజిత్‌ వాడేకర్‌ కన్నుమూశారు. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ముంబైలోని జస్‌లోక్‌ ఆస్పత్రిలో రాత్రి తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్‌ అయిన అజిత్‌ వాడేకర్‌ సారథ్యంలో 1971లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్ట్‌ సిరీస్‌ను గెలవడం ఆయనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. తన ఎనిమిదేళ్ల టెస్ట్‌ కెరీర్‌లో ఆడిన 37 టెస్ట్‌ మ్యాచ్‌ల్లో 14 అర్థశతకాలు, ఒక శతకంతో మొత్తం 2113 పరుగులు చేశారు. అజారుద్దీన్‌ కెప్టెన్సీలో భారత జట్టుకు మేనేజర్‌గానూ సేవలందించారు. క్రీడారంగంలో ఆయన ప్రతిభకుగానూ భారత ప్రభుత్వం 1967లో అర్జున అవార్డు, 1972లో పద్మశ్రీలతో గౌరవించింది. సీకె నాయుడు జీవిత సాఫల్య పురస్కారం కూడా అజిత్‌ వాడేకర్‌ అందుకున్నారు.

Don't Miss