జోరుగా కల్తీనూనే విక్రయాలు

08:55 - December 4, 2016

ఆదిలాబాద్ : కల్తీరాయుళ్లు బరితెగిస్తున్నారు. తాగే మంచినీళ్ల దగ్గర నుంచి తినే తిండి వరకు ప్రతిదీ కల్తీమయం చేస్తున్నారు. ఇటీవలే గుంటూరులో భారీ ఎత్తున కల్తీ కారం ముఠా గుట్టు రట్టవ్వగా..తాజాగా ఆదిలాబాద్‌లో కల్తీ మంచినూనే దందా వెలుగులోకి వచ్చింది. కాగజ్‌నగర్లో పలు కిరాణాదుకాణాలతో కల్తీనూనే విక్రయాలు జోరుగా సాగుతున్నాయన్న సమాచారంతో విజిలెన్స్‌ అధికారులు దాడులు చేశారు. అయితే విజిలెన్స్‌ దాడుల్లో ఓ కిరాణాషాపులో నిల్వ ఉంచిన వెయ్యి లీటర్ల కల్తీ వంటనూనే బయటపడింది. ఐదు డ్రమ్ములను స్వాధీనం చేసుకున్న అధికారులు వాటి నుంచి సాంపిల్స్‌ను సేకరించి పరీక్ష కోసం హైదరాబాద్‌కు పంపించారు. శాంపిల్ టెస్టులో నకిలీ ఆయిల్‌ అని తేలితే కల్తీనూనే తయారు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. 

 

Don't Miss