జయ'మృతిపై నటుల సంతాపం..

15:40 - December 6, 2016

హైదరాబాద్ : తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత మృతి చెందడం బాధాకరమని టాలీవుడ్ నటులు పేర్కొన్నారు. జయలలిత అపోలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈసందర్భంగా పలువురు తమ సంతాపాన్ని తెలియచేశారు.
పేద ప్రజల, రాజకీయ నేతల హృదయాల్లో మహా నాయకురాలిగా నిలిచిపోతోందని సీనియర్ నటులు జమున పేర్కొన్నారు. సాహసానికి మారు పేరని, ధైర్యవంతురాలని కొనియాడారు.
సీఎం అంటే ఇలా ఉండాలని, భారతదేశాన్ని పాలించే శక్తి జయకు ఉందని, బ్లాక్ మెయిల్ చేసే వారు ఉండరని సుమన్ పేర్కొన్నారు.
జయ స్త్రీ శక్తి అని సినీ నటుడు రాజేంద్రప్రసాద్ తెలిపారు. కథా నాయికలు ప్రజా నాయకులు అవతారని జయ నిరూపించారని తెలిపారు.
తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత చనిపోవడం బాధాకరంగా ఉందని టాలీవుడ్ సినీ దంపతులు విజయనిర్మల, కృష్ణ పేర్కొన్నారు. ఆమె మృతి చెందడంతో నలుగురు గుండెపోటుతో మృతి చెందారని తెలిపారు.
ఆమె పాట పాడినా..డ్యాన్స్ లు ఉర్రూతలూగించేవని, మహిళా రాజకీయ శక్తి అని సినీ దర్శకుడు దాసరి నారాయణ రావు పేర్కొన్నారు.

Don't Miss