సూర్య వెనక్కి తగ్గాడు

12:02 - December 4, 2016

మెగా ప్రెండ్ షిప్ కోసం అనుకున్నట్టుగానే సూర్య వెనక్కి తగ్గాడు. మెగా ప్రొడ్యూసర్ నేరిపిన మంతనాలతో కోలీవుడ్ స్టార్ తన సినిమాను పోస్ట్ పోన్ చేసుకున్నాడు. ఇంతకీ సూర్య సింగం 3 రిలీజ్ డేట్ ఎప్పుడు కన్ ఫర్మ్ చేశారో మీరే చూడండి.
లేట్ గా సూర్య సింగం 3 షూటింగ్ 
సూర్య సింగం 3 షూటింగ్ చాలా లేట్ గా జరుపుకుంది. అందుకే తగ్గట్టే ఇప్పుడు రిలీజ్ డేట్ విషయంలో కూడా వాయిదాలు పడుతుంది. నిజానికి ఈ సినిమాను డిసెంబర్ ఫస్ట్ వీక్ లో 9 న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఈ డేట్ నుంచి తప్పుకుంది. ఆ తరువాత డిసెంబర్ 16 రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఇప్పుడు ఈ డేట్ కూడా మారింది. కేవలం మెగా హీరో రామ్ చరణ్ కోసమే సూర్య తన సినిమాను పోస్ట్ ఫోన్ చేసినట్లు తెలుస్తుంది.
ఈనెల 16న  సింగం 3 విడుదల 
సూర్య కథానాయకుడిగా రూపొందిన సింగం 3 సినిమాను ఈ నెల 16వ తేదీన విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించారు. అయితే ధృవ సినిమా రిలీజ్ ను ఈ నెల 9వ తేదీన పెట్టుకున్న అల్లు అరవింద్, ఈ సినిమా వసూళ్లపై సింగం 3 ప్రభావం చూపుతుందని భావించారు. దీంతో సింగం3సినిమా విడుదల తేదీని వాయిదా వేసుకోమని  నిర్మాత జ్ఞానవేల్ రాజాతో పాటు సూర్యతో ఆయన మాట్లాడుతున్నట్టుగా వార్తలు వచ్చాయి. దీంతో మెగా ఫ్రొడ్యూసర్ జరిపిన మెగా మంతనం బాగానే పనిచేసింది.
థర్డ్ సీక్వెల్ పై భారీ అంచనాలు 
సూర్యతో పాటు జ్ఞానవేల్ రాజాకి అల్లు అరవింద్ తో పాటు మెగా ఫ్యామిలీ హీరోలతో మంచి ప్రెండ్ షిప్ ఉంది. ఆ రిక్వెస్ట్ తో పాటు బడా ప్రొడ్యూసర్ అయిన అల్లు అరవింద్ స్వయంగా అడగటంతో సింగం 3ని వెనక్కి జరిపారు. మొత్తానికి మెగా ఫ్యామిలీ కోసం 16 తేదీ నుంచి వెనక్కి జరిగిన సూర్యం సింగం 3. ఈ నెల 23న విడుదల కానుంది. మొదటి రెండు భాగాలు సక్సెస్ కావడంతో ఈ థర్డ్ సీక్వెల్ పై భారీ అంచనాలు ఉన్నాయి.

 

Don't Miss