గేట్ వే హోటల్ లో ఏపీ మంత్రివర్గ ఉపసంఘం..

16:19 - December 4, 2016

విజయవాడ : కృష్ణా జలాల విషయంలో బ్రిజేష్‌కుమార్‌ ట్రైబ్యునల్‌ వెలువరించిన తీర్పును చర్చిచేందుకు ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గ ఉపసంఘం విజయవాడలో సమావేశమైంది. గేట్‌ వే హోటల్‌లో నిర్వహించిన ఈ సమావేశానికి మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, పరిటాల సునీత, రావెల కిషోర్‌బాబు, జలవనరుల శాఖ అధికారులు, సుప్రీంకోర్టులో వాదనలు వినిపించిన న్యాయవాదులు హాజరయ్యారు. తీర్పు విషయంలో ఎలా ముందుకెళ్లాలన్న దానిపై ఈ సమావేశంలో చర్చిస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర ప్రయోజనాలకు భంగం వాటిల్లని విధంగా పొరుగు రాష్ట్రాలతో వివాదాలు తలెత్తకుండా ఏం చేయాలన్న దానిపై సమగ్రంగా చర్చిస్తున్నారు. సెక్షన్‌ 89 (బి)లకు సంబంధించి కేసు ఫైల్‌ చేయడంతో పాటు పోలవరం తూర్పు కాలువల ద్వారా గోదావరి నీటిని కృష్ణాకు మళ్లించే విషయంపైనా చర్చించారు. అనంతరం రాబోయే రోజుల్లో కేసుకు సంబంధించిన వివరాలు సమావేశాల్లో తెలియచేశారని మంత్రి దేవినేని మీడియాకు తెలిపారు. ఈ విషయాలు సీఎం చంద్రబాబు నాయుడికి, కేబినెట్ కు తెలియచేస్తామన్నారు. భవిష్యత్ లో ఏ విధంగా ముందుకు వెళ్లాలనే దానిపై కేబినెట్ నిర్ణయిస్తుందన్నారు.

Don't Miss