జయలలిత మృతికి ఏపీ సంతాపం : చంద్రబాబు

12:16 - December 6, 2016

విజయవాడ : తమిళనాడు సీఎం ముఖ్యమంత్రి జయలలిత మంగళవారం మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఏపీ రాజధాని అమరావతిలో సీఎం చంద్రబాబు మౌనం పాటించి సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ..ఆమెకు తన సంతాపాన్ని ప్రకటించారు. ఆమె మృతికి ఏపీ రాష్ట్ర ప్రజలు రెండునిమిషాలు మౌనం పాటించి సంతాపం ప్రకటించాలని కోరారు. ఆమె జీవితంలో ఆమె ఎంతో పోరాటం చేశారని..రాష్ట్ర రాజకీయాల్లో ఆమె ఒక ప్రభంజనం సృస్టించారన్నారు. ఆమెకు తెలుగు రాష్ట్రాలకు ఎంతో అవినావభావ సంబంధముందని తెలిపారు. ఎన్టీఆర్ తో కలిసి ఎన్నో చిత్రాల్లో నటించారనీ..తనపై నక్సల్స్ దాడి జరిగినప్పుడు తనకు ఎంతో సహకారం అందించారని గుర్తు చేసుకున్నారు. జయలలితో కూడిని కొంతమంది సీఎంలతో కలిసి ఓ సంస్థను స్థాపించినట్లుగా తెలిపారు. తెలుగు గంగ నీటి విషయంలో కూడా ఆమె సహకారం అందించారన్నారు. ఆమె ఆసుపత్రిలో వున్న సమయంలో కూడా సహకారం అందించి నీటిని విడుదల చేయించారని తెలిపారు. పేదలపట్ల..మహిళలపట్ల ఆమె ఎంతో సహృదయంతో వ్యవహరించేవారన్నారు. ఆమె భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించేదుకు తమిళనాడు వెళుతున్నట్లుగా తెలిపారు. ఈ సందర్భంగా తమిళ ప్రజలకు ఆయన సంతాపం తెలిపారు. ఆమె ఏ ఆశయాల కోసం పోరాడిందో..వాటిని రాష్ట్ర మంత్రులు..ప్రజలు నెరవేర్చాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ పలువురు పాల్గొన్నారు.

Don't Miss