పోలవరం నిర్వాసితులపై ఏపీ సర్కార్ దృష్టి ..

07:27 - December 8, 2016

గుంటూరు : పోలవరం ప్రాజెక్ట్‌ నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని ఆంధప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయిచింది. ఇందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. ప్రతిపక్ష నేత జనగ్‌ రాజకీయలబ్ధి కోసం పోలవరం ప్రాజెక్ట్‌ను అడ్డుపెట్టుకుని గిరిజనులను రెచ్చగొడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు.

గుంటూరు జిల్లా వెలగపూడిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి
చంద్రబాబునాయుడు వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడం, వార్షికాభివృద్ధి రేటు పెంపుకు తీసకోవాల్సిన చర్యలతోపాటు. పోలవరం నిర్వాసితులకు పరిహారం చెల్లింపు వంటి అంశాలపై చర్చించారు.

పోలవరం నిర్వాసితులుకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం
పోలవరం ప్రాజెక్ట్‌ నిర్వాసితులకు సాధ్యమైనంత త్వరగా పరిహారం చెల్లించేందుకు చర్యలు ప్రారంభించాలని చంద్రబాబు ఆదేశించారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని కోరారు. నిర్వాసితులు పునరావాసంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ప్రతిపక్ష నేత జగన్‌ పోవరాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, రాజకీయలబ్ధి కోసం గిరిజనులను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు.

రాష్ట్రంలో రెండంకెల వృద్ధి రేటు సాధిస్తాం
అభివృద్ధిలో ఏపీని ప్రపచంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలబెట్టాలని చంద్రబాబు లక్ష్యంగా నిర్ణయించుకున్నారు. గతేడాది మాదిరిగానే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కూడా రెండంకెల అభివృద్ధి సాధిస్తామన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ విషయంలో కేంద్రం కంటే రాష్ట్రమే మెరుగైన స్థాయిలో ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. గతేడాడి 10.99 శాతం వృద్ధి రేటు సాధిస్తే... 2016-17 మొదటి అర్థభాగంలోనే 12.23 శాంత వృద్ధి సాధించిన విషయాన్ని ప్రస్తావించారు. దీనిని 15 శాతానికి తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు, ఇందుకు అనుగుణంగా అందరూ కలసినట్టుగా పని చేయాలని కోరారు.

నగదు కొరత తీర్చేందుకు చర్యలు..
నగదు కొరతతో గ్రామీణ ప్రజలు పడుతున్న ఇబ్బందులను సాధ్యమైనంత తర్వగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. 

Don't Miss