టిపిసిసి కమిటీల ప్రకటన...!

13:49 - August 30, 2018

హైదరాబాద్ : కాంగ్రెస్ స్పీడు పెంచింది. ముందుస్తు ఎన్నికలు వస్తే అనుసరించాలిస్నవ్యూహంపై కాంగ్రెస్ సీనియర్ నేతలు చర్చల మీద చర్చలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో టిపిసిసి చీఫ్ ఉత్తమ్ హస్తినకు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో ఆయన భేటీ కానున్నారు. ఈ భేటీలో కుంతియా, ఏఐసీసీ కార్యదర్శులు పాల్గొననున్నారు. ముందస్తు యాక్షన్ ప్లాన్ ను హై కమాండ్ సూచించనుంది. పీసీసీ ప్రచార కమిటీ, మేనిఫెస్టో కమిటీలను ఏఐసీసీ ప్రకటించనుంది. మ్యానిఫెస్టో కమిటీ ఛైర్మన్ గా దామోదర రాజ నర్సింహ, ప్రచార కమటీ ఛైర్మన్ గా రేవంత్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ గా పొన్నం ప్రభాకర్ లను నియమించే అవకాశం ఉంది. 

Don't Miss