లంచగొండి కేజీహెచ్ సీనియర్ అసిస్టెంట్...

12:33 - July 25, 2018

విశాఖపట్టణం : కేజీహెచ్ సీనియర్ అసిస్టెంట్, జిల్లా ఎన్జీవో అధ్యక్షుడు కొటారి ఈశ్వర్ రావు నివాసం పై ఏసీబీ దాడి చేసింది. ఏక కాలంలో సోదాలు నిర్వహించిన అధికారులు కోటిన్నరకు పైగా అక్రమస్తులున్నట్లు గుర్తించారు. కోటారి ఈశ్వరరావు ఒకే చోటు కొన్ని ఏళ్లుగా పని చేస్తున్నారు. మందు సరఫరాకు 8 ఏళ్లుగా గుంటూరు జయకృష్ణ ఇండస్ట్రీస్ కు టెండర్లు దక్కడంపై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. విశాఖలోని ఇల్లు, అక్కయ్యపాలెంలో ఒక ఫ్లాటు, నర్సీపట్నంలో ఇల్లు, ఇంటి స్థలం రెండెకరాల పొలం..ఇతరత్రా వాటిని గుర్తించారు. లక్ష రూపాయల కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. 

Don't Miss