9నెలల చిన్నారి హత్యాచారం కేసు : చేతులతో నోరు నొక్కి అఘాయిత్యం

Submitted on 19 June 2019
9 months old baby rape murder case, dcp reaction

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన 9నెలల చిన్నారి హత్యాచారం కేసులో నిందితుడికి కఠిన శిక్షపడేలా చర్యలు తీసుకుంటున్నట్లు సెంట్రలో జోన్ డీసీపీ నరసింహ తెలిపారు. పసిపాపై అత్యాచారం, హత్య కేసుని పోలీస్ శాఖ తీవ్రంగా పరిగణిస్తోందన్నారు. ఈ ఘోరాన్ని యావత్ సమాజం ఖండించిందన్నారు. నిందితుడు చేతులతో పాప నోరు నొక్కి అమానుషంగా హత్య చేశాడని డీసీపీ చెప్పారు. సీసీటీవీ ఫుటేజ్, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలం తీసుకున్నామని.. నిందితుడు ప్రవీణ్ కి నిర్బయ తరహా శిక్ష పడేటట్లు విచారణ వేగవంతం చేశామన్నారు. తెలంగాణ వ్యాప్తంగా మానవ మృగాలకు కనువిప్పు కలిగేలా ఈ కేసుని ఛాలెంజ్ గా తీసకున్నామన్నారు. కోర్టులో కూడా విచారణ వేగంగా పూర్తయ్యేలా  ప్రయత్నిస్తామన్నారు. నిందితుడికి కఠిన శిక్ష అమలయ్యే విధంగా చూస్తామని డీసీపీ అన్నారు.

చిన్నారి హత్యాచారం కేసులో పోలీసులకు కీలక ఆధారం లభించింది. నిందితుడు.. చిన్నారిని తీసుకెళ్తున్న సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చిన్నారి మృతదేహానికి పోస్టుమార్టం పూర్తైంది. మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాఫ్తులో వేగం పెంచారు.

వరంగల్ అర్బన్ జిల్లాలో ఈ దారుణం జరిగింది. హన్మకొండ టైలర్ స్ట్రీట్‌లో 9 నెలల చిన్నారిపై కొలిపాక ప్రవీణ్(28) అనే యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం హత్య  చేశాడు. జగన్-రచన దంపతులకు కుమార్తె ఉంది. 9 నెలల వయసు. మంగళవారం(జూన్ 18,2019) రాత్రి తల్లిదండ్రులతో కలిసి డాబాపై నిద్రిస్తుండగా..ప్రవీణ్ అక్కడికెళ్లాడు.  ఆడిపిస్తానని తీసుకెళ్లి తిరిగి తీసుకురాలేదు. దీంతో ఆందోళన చెందిన చిన్నారి తల్లిదండ్రులు అతని ఇంటి వైపు వెళ్లారు. అక్కడ పాప విగతజీవిగా పడి ఉండటంతో ఇద్దరూ షాక్  తిన్నారు. ప్రవీణ్ అత్యాచారం జరిపి.. హత్య చేసినట్టుగా గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ప్రవీణ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. చిన్నారి హత్యపై ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు ఆందోళనకు దిగాయి. ప్రవీణ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

9 months old baby
Rape
murder case
warangal
Hanmakonda


మరిన్ని వార్తలు