తిరుపతి-కాకినాడ మధ్య 80 ప్రత్యేక రైళ్లు

Submitted on 18 July 2019
80 special trains between tirupati and kakinada

హైదరాబాద్ : ప్రయాణికుల రద్దీ దృష్ట్యా తిరుపతి-కాకినాడ మధ్య 80 ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.  వారానికి 3 రోజులు నడిచే ఈ  ప్రత్యేక రైళ్లు ఆగస్టు 1నుంచి నవంబర్ 1 మధ్య నడుస్తాయి.  

తిరుపతిలో 07432 నంబరు గల రైలు ప్రతి ఆది, మంగళ, గురువారాల్లో సాయంత్రం 6.50 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 5.30 గంటలకు కాకినాడ టౌన్‌ చేరుకుంటుంది. 
తిరిగి కాకినాడ టౌన్‌లో 07431 నంబరు గల రైలు ప్రతి సోమ, బుధ, శుక్ర వారాల్లో రాత్రి 9 గంటలకు బయల్దేరి ఉదయం 8.45 గంటలకు తిరుపతి చేరుకుంటుంది.

ఈ రైళ్లు రేణిగుంట, శ్రీకాళహస్తి గూడూరు, నెల్లూరు, ఒంగోలు, తెనాలి, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్ల కోట స్టేషన్లలో ఆగుతాయి. వీటిలో స్లీపర్‌, జనరల్‌ బోగీలు ఉంటాయని ఎస్.సీ.రైల్వే అధికారులు తెలిపారు. 

Andhra Pradesh
South Central Railway
Kakinada
Tirupati
Special Trains
sc railway

మరిన్ని వార్తలు